నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
posted on Aug 8, 2012 @ 10:15AM
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు వేడివేడిగా సాగడానికి రంగం సిద్ధమైంది. అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థికవ్యవస్థ మొదలుకుని అస్సాం హింసాకాండవరకు అనేక అంశాలపై పాలకపక్షాన్ని ఎండగట్టడానికి విపక్షాలు అస్త్రశస్త్రాలతో తయారయ్యాయి. సామాన్యుడి జీవితాన్ని అధ్వానంగా మార్చిన ఆర్థికరంగం తీరుతెన్నులు, రిటైల్‌రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐలకు) అనుమతి, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో దుర్భిక్ష పరిస్థితులు, పవర్‌గ్రిడ్‌ల వైఫల్యంపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని విపక్షాలు కృతనిశ్చయంతో ఉన్నాయి. నేటి నుంచి సెప్టెంబర్ 7వ తేదీవరకు నెలరోజులపాటు జరిగే సమావేశాల్లో సెలవులు మినహాయిస్తే, ఉభయసభలు 20 రోజులపాటు పనిచేస్తాయి. ఈ 20 రోజుల్ని పూర్తిస్థాయిలో సద్వినియోగపర్చుకుని పెండింగ్ బిల్లులన్నింటికీ ఆమోదం సాధించాలని, కొత్తగా కొన్నింటిని ప్రవేశపెట్టాలని, చివర్లో లోక్‌పాల్ బిల్లును కూడా రాజ్యసభ ఆమోదానికి తేవాలని కేంద్రం నిర్ణయించింది.