వెంకన్నసేవకు చేనేత వస్త్రాలు:కె.బాపిరాజు
posted on Aug 7, 2012 @ 9:03PM
న్యూఢిల్లీ:ఇకపై శ్రీవారి సేవకు కూడా చేనేత వస్త్రాలనే వినియోగిస్తామని టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు చెప్పారు.ఆప్కో ద్వారా వీటిని కొనుగోలు చేస్తామన్నారు..శ్రీ వెంకటేశ్వరుని పూజకు ఎలాంటి రసాయన కలుషితాలు లేకుండా నేసిన వస్త్రాలను వినియోగించేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న మన గుడి కార్యక్రమంలో కూడా చేనేత వస్త్రాలే వినియోగిస్తామని చెప్పారు.దీనివల్ల ఇటు పవిత్రతను కాపాడటంతోపాటు చేనేత కార్మికులను ఆదుకున్నట్టు అవుతుందన్నారు. ఇందుకోసం ఏటా అయ్యే రూ.2 కోట్లు నేత కార్మికులకు అందితే భక్తులు ఇచ్చే విరాళాలు సైతం సద్వినియోగమవుతాయని చెప్పారు.