అబార్షన్ వికటించి మృతి చె౦దిన విజయలక్ష్మి
posted on Aug 7, 2012 @ 2:12PM
అబార్షన్ వికటించిన ఘటనలో చికిత్స పొందుతూ బాధితురాలు విజయలక్ష్మి మంగళవారం ఉదయం మృతి చెందింది. ప్రియుడి చేతులో మోసపోయి గర్భందాల్చిన విజయలక్ష్మికి నాలుగురోజుల క్రితం ప్రియుడు నర్సు విజయకుమారి చేత అబార్షన్ చేయించాడు. అబార్షన్ వికటించడంతో ఆమె ఆరోగ్యపరిస్థితి విషమంగా మారింది. తీవ్ర అనారోగ్యంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ కేసులో ఇప్పటికే ప్రియుడు, నర్సును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.