తలరాత బాగుండే కిరణ్ సీఎం అయ్యాడు: బొత్స
posted on Aug 8, 2012 @ 4:29PM
తలరాత బాగుండి మంత్రి కాకుండానే కిరణ్ నేరుగా ముఖ్యమంత్రి అయ్యారని బొత్సా వ్యాఖ్యానించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో పెరిగిన ఫీజుల భారంపై పునరాలోచిస్తామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. గత ప్రభుత్వాల నిర్ణయాలు తమకు గుదిబండగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫెయిలైన విద్యార్థుల ఫీజులు చెల్లించాలా వద్ద అనే అంశంపై చర్చ జరగాలని ఆయన అన్నారు. ఇంజనీరింగ్లో కనీసం 35 శాతం ఉత్తీర్ణత కూడా ఉండటం లేదన్నారు. రాష్ట్ర కాంగ్రెస్లో కోవర్టులు ఎవరూ లేరని బొత్స అన్నారు. ధర్మాన కమిటీలో కొత్త విషయాలు ఏమి లేవని ఆయన తేల్చేశారు.