రాష్ట్రంలోని పలు జిల్లాలో భూప్రకంపనలు
రాష్ట్రంలోని పలు జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలో నాలుగు సెకన్ల పాటు భూ ప్రకంపనలు సంభవించాయి. భూమి కంపించటంతో ప్రజలు భయాందోళనకు గురై రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంప తీవ్రంగా రిక్టర్ స్కేల్‌పై 1.8 నుంచి 2.3 గా నమోదైంది. విజయవాడ భూకంప అధ్యయన కేంద్రం అధికారులు మాట్లాడుతూ ఇవి స్వల్ప భూ ప్రకంపనలు మాత్రమే అని, భూ పొరల్లో సర్దు బాట్ల కారణంగా ప్రకంపనలు జరిగినట్లు తెలిపారు. ప్రజలు ఎవరూ ఆందోళ చెందాల్సి అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఆరు నెలల కాలంలో ప్రకంపనలు చోటు చేసుకోవడం ఇది రెండోసారి. ఈసారి గతంలో కన్నా ఎక్కువ తీవ్రతతో ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సుమిత్రా దీవిలో చోటు చేసుకున్న ప్రకంపనలు కూడా రాష్ట్రంలోని ప్రకంపనలకు కారణం కావచ్చునని భావిస్తున్నారు.
భూమి కంపించిన ప్రాంతాలు
# గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల, అచ్చంపేట, మాచర్ల ప్రాంతం
# కృష్ణా జిల్లాలోని నందిగామ, చందర్తి పాడు, జగ్గయ్యపేట
# ఖమ్మం జిల్లాలోని చింతకాని, సత్తిపల్లి, మధిర
# నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ, దామచర్ల, తిప్పర్తి, హాలియా, సూర్యాపేట, మేళ్లచెర్వు
# రంగారెడ్డి జిల్లాలోని హయత్‌నగర్
# ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, దర్శి, అద్దంకి, సంతనూతలపాడు, కందుకూరు ప్రాంతాల్లో భూమి కంపించింది.