నా వల్లే నా భార్యకు కేంద్రమంత్రి రాలేదు: బొత్స
posted on Oct 29, 2012 @ 4:17PM
తన భార్య బొత్స ఝాన్సీ కి తన వల్లే కేంద్ర మంత్రి పదవి రాలేదని బొత్స సత్యనారాయణ అన్నారు. తాను పిసిసి అధ్యక్షుడిగా, మంత్రిగా పదవిలో ఉండడం వల్లే తన భార్యకి కేంద్ర మంత్రి ఇవ్వలేదని చెప్పారు. కేంద్ర మంత్రి వర్గంలో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం ఇచ్చినందుకు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ కి కృతజ్ఞతలు చెప్పారు. మంత్రి వర్గ మార్పుల్లో చిన్నపాటి సమస్యలున్నా సర్దుకుంటాయని, జైపాల్ రెడ్డి శాఖ మార్పు ప్రమోషనో, డిమోషనో తనకు తెలియదని, ఏ శాఖ అప్పగించినా జైపాల్ రెడ్డి సమర్థంగా నిర్వహిస్తారని అన్నారు.
అవకాశం వస్తే చిరంజీవి పార్టీకి నాయకత్వం వహిస్తారని ఆయన అన్నారు. పార్టీలో పనిచేసే వారికే పదవులు లభిస్తాయన్నారు. కేంద్ర మంత్రివర్గంలో మరి కొంత మంది బిసీలకు స్థానం కల్పించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర మంత్రులు పనిచేయాలన్నారు. మంత్రులుగా అందరికీ అవకాశం రాదని, చిన్నపాటి అసంతృప్తులు సహజమేనని అన్నారు.