తెలంగాణలో హల్ చల్ చేస్తున్న కీలక నేతలు
posted on Oct 29, 2012 @ 3:34PM
రాష్ట్రానికి చెందిన ముగ్గురు కీలక నేతలు తెలంగాణాలో హల్ చల్ చేయబోతున్నారు. టీఆర్ఎస్ పార్టీ మాత్రం వీరిని ఎలా అడ్డుకోవాలో తెలియక సతమతమవుతోంది. టీడీపి అధినేత చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ, సీఎం కిరణ్ కుమార్ రెడ్డినీ అడ్డుకోనే౦దుకు గతంలో టీఆర్ఎస్ పార్టీ చాలా ప్రయత్నాలు చేసింది.
ఆల్రెడీ చంద్రబాబు నాయుడు తెలంగాణలో వస్తున్నా మీ కోసం యాత్ర చేస్తున్నారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ తెలంగాణలో నల్గొండ జిల్లా భువనగిరిలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఈ సభలో యువ తెలంగాణ జేఎసీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ సంధర్బంలో జిట్టా బాలకృష్ణ రెడ్డి తన బాల ప్రదర్శన కోసం భారీగా జనాల్ని సమీకరిస్తుండడంతో టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
మెదక్ జిల్లాలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇందిరమ్మ బాట కూడా ఈ రోజు నుంచే ప్రారంభ౦ కానున్న నేపధ్యంలో టీఆర్ఎస్ నేతలు బాటను అడ్డుకుంటామని ప్రకటించారు. దీంతో పోలీసులు ముందస్తు అరెస్ట్ లు ప్రారంభించారు. మొత్తానికి రాష్ట్రానికి చెందిన ముగ్గురు కీలక నేతలు రాష్ట్రంలో హల్ చల్ చేస్తుంటే, టీఆర్ఎస్ నేతలు మాత్రం తమ భవిష్యత్ కార్యాచరణ ఏమిటో తెలియక గందరగోళంలో పడిపోతున్నారు.