కేంద్రమంత్రి పురందేశ్వరికి షాక్
posted on Oct 29, 2012 @ 3:23PM
ఈ సారి క్యాబినెట్ హోదా ఖాయమని అనుకున్న కేంద్రమంత్రి పురందేశ్వరికి షాక్ తగిలింది. ఆమెకు శాఖ మార్పు తప్ప, ప్రమోషన్ లభించలేదు. కేంద్ర క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో మానవ వనరురుల శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న పురందేశ్వరికి వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా పదవి మార్పు మాత్రమే లభించింది.
మరోవైపు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా పనిచేస్తున్న జైపాల్ రెడ్డిని ఆ పదవి నుండి తప్పించి ఏ మాత్రం ప్రాధాన్యత లేని శాస్త్ర, సాంకేతిక శాఖను కేటాయించడం చర్చకు తెర లేపుతోంది. రిలయన్స్ సంస్థతో జైపాల్ రెడ్డికి వున్న విబేధాల కారణంగానే ఆయనకు డిమోషన్ లభించిందని అంటున్నారు.
చిరంజీవికి స్వతంత్ర హోదాలో పర్యాటక శాఖ, కిల్లి కృపరాణికి ఐటీ శాఖ సహాయ మంత్రి పదవి, బలరాం నాయక్ కి సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి పదవి, సర్వే సత్యనారాయణకు ఉపరితల రవాణా శాఖ సహయ మంత్రి పదవి, కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డికి రైల్వే శాఖ సహాయ మంత్రి పదవి దక్కాయి. కేంద్ర మంత్రి పల్లం రాజుకి ప్రమోషన్ లభించింది. మానవ వనరుల అభివృద్ది శాఖ దక్కింది.