హీరో నాని మ్యారేజ్ ఫొటోస్ లేటెస్ట్
posted on Oct 29, 2012 @ 12:03PM
హీరో నాని వివాహం శనివారం రాత్రి విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. రుషికొండ ప్రాంతంలోని న్యూనెట్ టెక్నాలజీ ఐటీ సంస్థ ప్రాంగణంలో నగరానికి చెందిన వ్యాపారవేత్త యలపర్తి రతీష్ కుమార్తె అంజనను నాని వివాహం చేసుకున్నారు. వివాహానికి పెద్ద సంఖ్యలో అభిమానులు, దర్శకుడు కృష్ణవంశీ, నటులు తరుణ్, దగ్గుబాటి రాణా, భీమిలి కబడ్డీ జట్టు చిత్రయూనిట్ సభ్యులు హాజరయ్యారు. ప్రత్యేక కల్యాణ మంటపంలో నాని పెళ్లి కనులపండువగా జరిగింది. తాను ప్రేమించిన వ్యక్తినే నాని పెళ్లి చేసుకున్నారు.