మోహన్ బాబుపై కేసు నమోదు
posted on Oct 30, 2012 @ 5:57PM
బ్రాహ్మణులను కించపరిచే విధంగా సన్నివేశాలున్న దేనికైనా రెడీ సినిమాపై మల్కాజ్‌గిరి కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ చిత్రంలో బ్రాహ్మణులను కించపరిచారని న్యాయవాది శ్రీనివాస్‌యాదవ్ కోర్టు పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన కోర్టు నిర్మాత మోహన్‌బాబు, దర్శకుడు నాగేశ్వర్‌రెడ్డి, నటులు మంచు విష్ణు, బ్రహ్మానందంపై కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దేనికైనా రెడీ చిత్రాన్ని నిలిపివేయాలని బ్రాహ్మణులు డిమాండ్ చేస్తూ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని శ్రీమయూరి థియేటర్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆందోళనకు దిగిన బ్రాహ్మణులను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం మోహన్ బాబు ఇంటిముందు కొందరు ఆందోళన చేయగా వారు కిరాయి బ్రాహ్మణులని మోహన్ బాబు అన్నారు.