పేదలకు ఉచితంగా ఇళ్ళు : చంద్రబాబు
posted on Oct 29, 2012 @ 5:34PM
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రూ.లక్ష ఖర్చుతో పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. వస్తున్న మీకోసం యాత్రలో భాగంగా 27వ రోజు ఆయన మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. చింతరేవుల పల్లిలో ఆయన ప్రసంగించారు. ప్రజల కష్టాలు తెలుసుకుని వారికి అండగా ఉండేందుకే వచ్చినట్లు ఆయన తెలిపారు. గ్రామస్థులు తాగునీటి సమస్య గురించి ప్రస్తావించగా ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. తెదేపా అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి మరుగుదొడ్డి మంజూరు చేస్తామన్నారు. బెల్టు షాపులు పూర్తిగా రద్దు చేస్తామని, ఆదరణ పథకాన్ని మళ్లీ అమలు చేస్తామని వెల్లడించారు. ఈ పథకం ద్వారా వృత్తిదారులకు పరికరాలు అందిస్తామన్నారు.