నిమ్మగడ్డని పరామర్శించిన జగపతిబాబు
posted on Oct 30, 2012 @ 1:51PM
వాన్ పిక్ కుంభకోణంలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటూ చంచల్ గూడ జైల్లో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ ని హీరో జగపతి బాబు పరామర్శించారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని, తప్పకుండా న్యాయం జరుగుతుందని.. జగపతి.. నిమ్మగడ్డ ప్రసాద్ కి ధైర్యం చెప్పినట్టు సమాచారం.
నిమ్మగడ్డకి అత్యంత ఆప్తుడైన హీరో నాగార్జునకూడా చాలాసార్లు చంచల్ గూడ జైలుకొచ్చిన తనతో మాట్లాడివెళ్లారు. ప్రసాద్ తనకి చాలా ఆప్తుడని, ఇలాంటి పరిస్థితి ఎదురౌతుందని ఊహించలేదని నాగార్జున బాధపడ్డారుకూడా. సినీ పరిశ్రమలో చాలామందితో నిమ్మగడ్డ ప్రసాద్ కి మంచి రిలేషన్స్ ఉన్నాయ్.
బ్యాట్మిండన్ కోచ్ పుల్లెల గోపీచంద్, చాముండేశ్వరీ నాథ్ కూడా గతంలో నిమ్మగడ్డని చంచల్ గూడ జైల్లో కలిశారు. సినీ ప్రముఖులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు నిమ్మగడ్డని పరామర్శించేందుకు చంచల్ గూడ జైలు దగ్గరికి వస్తుండడంతో వాళ్లని చూసేందుకు సామాన్య జనం ఎగబడుతున్నారు. విఐపిల రాక కారణంగా జైలుపరిసరాల్లో జనం బాగా పెరిగిపోతున్నారని అధికారులు చెబుతున్నారు.