చాణక్యుడు చెప్పిన మాట.. ఆడవాళ్లు ఇలాంటి వ్యక్తులకు ఎప్పుడూ దూరంగా ఉండాలట..!
చాణక్యుడు చెప్పిన మాట.. ఆడవాళ్లు ఇలాంటి వ్యక్తులకు ఎప్పుడూ దూరంగా ఉండాలట..!
హిందూ మతంలో మహిళలకు దేవుని తర్వాత అత్యున్నత స్థానం ఇవ్వబడింది. స్త్రీలను గౌరవించే చోట దేవుళ్లు కొలువై ఉంటారని కూడా అంటారు. ఆడవారి గురించి హిందూ మత గ్రంథాలలో చాలా గొప్పగా ప్రస్తావించారు కూడా. ఆచార్య చాణక్య కూడా స్త్రీల గుణాల గురించి చెప్పారు. మహిళలు సమాజానికి, దేశానికి కొత్త దిశానిర్దేశం చేస్తారని, వారు దేశ అభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తారని చాణక్యుడు చెప్పాడు.
నేటి కాలంలో ఒక వైపు మహిళలు ఆకాశాన్ని తాకుతున్నారు, మరోవైపు కొన్ని చోట్ల వారికి సమానత్వం లభించడం లేదు. మహిళలకు వారి గుర్తింపు, గౌరవం చాలా ముఖ్యమైనవి. మహిళలు కొందరి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలని, కొందరు వ్యక్తులకు దూరంగా ఉండటమే మంచిదని అంటున్నారు. ఇంతకీ మహిళలు ఎవరకి దూరంగా ఉండాలి? ఎందుకు దూరంగా ఉండాలి? తెలుసుకుంటే..
మోసగాళ్ళు, అబద్దాలు చెప్పేవారు..
సంబంధాలలో నిజం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కానీ అబద్ధాలు చెప్పే వారు మోసం చేయాలనే తలపుతోనే ఉంటారు. చాణక్యుడి ప్రకారం ఎప్పుడూ అబద్ధం చెప్పే వ్యక్తిని ఎప్పుడూ నమ్మకూడదు. అలాంటి వ్యక్తులు తమ సౌలభ్యం కోసం ఎప్పుడైనా అబద్ధాలను ఆశ్రయిస్తారు.
ఇది ఆడ, మగ అందరికీ వర్తిస్తున్నప్పటికీ, సంబంధాలు, స్నేహితులను ఏర్పరచుకునేటప్పుడు మహిళలు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఎవరికీ దగ్గరగా ఉండరు. వారు తీయగా మాట్లాడుతూ నమ్మకాన్ని గెలుచుకుంటారు. కానీ అవకాశం వచ్చిన వెంటనే మోసం చేస్తారు. అలాంటి వ్యక్తుల ప్రవర్తనపై ఒక కన్నేసి ఉంచాలి. సమయం చూసి వారి నుండి దూరం కావాలి.
నియంత్రణ చేసేవారు..
ఇది చేదు నిజం.. నేటికీ పురుషులు చాలా చోట్ల స్త్రీలను తమ నియంత్రణలో ఉంచుకోవాలని అనుకుంటున్నారు. చాణక్యుడు ఆడవారికి సలహా ఇచ్చాడు. ఆడవారి స్వేచ్ఛను హరించడానికి ప్రయత్నించే వారిని చాలా ప్రమాదకరమైన వ్యక్తులని చాణక్యుడు అన్నాడు. అలాంటి వ్యక్తులు ఆడవారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారు.
ఎవరైనా పదే పదే ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించినప్పుడు మహిళలు తమ ఆధిపత్యాన్ని కోల్పోయి, ఇతరులు చెప్పిన దాని ప్రకారం జీవించడం మొదలుపెడతారు. ఇలా జరిగినప్పుడు ఆడవారు ఆత్మవిశ్వాసం కోల్పోతారు. దీని వల్ల జీవితంలో తాము దేనికీ పనికిరాము అనే ఆత్మన్యూనతా భావంలోకి జారిపోతారు. అందుకే మహిళలు ఆత్మగౌరవం కలిగి ఉండాలి. తమ జీవితాన్ని ఎవరి చేతుల్లో కీలు బొమ్మలా ఉంచకూడదు.
అత్యాశ..
తమ స్వలాభం కోసం మాత్రమే చూసే వారు తమ స్వలాభం కోసం ఇతరులతో సంబంధాలు ఏర్పరచుకుంటారు. మహిళలు అలాంటి వారితో సంబంధాలు కొనసాగించకూడదు. ఇలాంటి వ్యక్తులు డబ్బు, పదవి కోసం మీతో ఉన్నామని తప్పుగా చెప్పుకుంటారు. కష్ట సమయాల్లో ఎప్పుడూ మీతో ఉండరు. అటువంటి పరిస్థితిలో విలువ ఇచ్చే వారికి మాత్రమే సమయం ఇవ్వడం వారిని నమ్మడం మంచిది.
*రూపశ్రీ.