మళ్లీ మళ్లీ వైఫల్యాలు ఎదురవుతుంటే చాణక్యుడు చెప్పిన సలహాలు పాటించండి..!
మళ్లీ మళ్లీ వైఫల్యాలు ఎదురవుతుంటే చాణక్యుడు చెప్పిన సలహాలు పాటించండి..!
జీవితంలో విజయం సాధించడానికి ప్రతి వ్యక్తి పరుగులు పెడుతూ ఉంటారు. ఇలా పరుగులు పెట్టినప్పుడు కొంతమంది ముందుకు వెళతారు, మరికొందరు వెనుకబడిపోతారు. ముందుకు సాగేవారు తమ లక్ష్యాలను సాధిస్తారు. కానీ వెనుకబడిన ఒత్తిడిలోకి జారిపోతారు. వారు విఫలమయ్యారని దీని అర్థం కాదు. నిజానికి చాలా సార్లు, పగలు రాత్రి కష్టపడి పనిచేసిన తర్వాత కూడా, ఆశించిన ఫలితాలు ఉండవు. ఇలాంటి వారికి ప్రతికూల భావన మనస్సులో ఉంటుంది. ఈ భావన వ్యక్తి ఆలోచనను ప్రభావితం చేస్తుంది. వ్యక్తి సామర్థ్యంపై లోతైన ప్రభావాన్ని చూపుతుంది. తనను తాను పాజిటివ్ గా ఉంచుకుని లక్ష్యాలు సాధించడానికి ఆచార్య చాణక్యుడు కొన్ని సలహాలు ఇచ్చారు. అవేంటో తెలుసుకుంటే..
ప్రభుతం కార్యమలాపం వా యన్నరః కర్తుమిచ్ఛతి ।
సర్వారంభేన్ తత్కార్యన్ సింహదేకం ప్రచక్షతే ॥
ఈ శ్లోకం అర్థం ఏమిటంటే వేట పెద్దదైనా లేదా చిన్నదైనా, సింహం ఎప్పుడూ పూర్తి శక్తితో దానిపైకి దూసుకుపోతుంది. అదేవిధంగా, పని పెద్దదైనా లేదా చిన్నదైనా వ్యక్తి దానిని పూర్తి చేయడానికి తన శక్తినంతా ఉపయోగించాలి. ఇలా చేస్తే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి.
సింహదేకం బకదేకం శిక్షేచ్ఛత్వారి కుక్కుటత్ ।
వాయసత్పఞ్చ శిక్షేచ్ఛ షట్శునస్త్రిణీ గర్దభాత్ ॥
ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఒక వ్యక్తి ఎల్లప్పుడూ సింహం, లేడి నుండి ఒక్కొక్క గుణం, కోడి నుండి నాలుగు, కాకి నుండి ఐదు, కుక్క నుండి ఆరు, గాడిద నుండి మూడు గుణాలు నేర్చుకోవాలట. ఈ ప్రపంచంలోని ప్రతి వస్తువు, జీవి నుండి మీరు ఏదైనా నేర్చుకుంటే, జీవితంలో విజయం, పురోగతి, అభివృద్ధిని సులభంగా సాధించవచ్చని ఆయన చెబుతాడు.
నాస్తి దేహినాం సుఖదుఃఖభావః.
ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, జీవితంలో అనారోగ్యంగా ఉండటం ఒక వ్యక్తికి దుఃఖం కలిగించే విషయం అని, ఆరోగ్యంగా ఉండటం గొప్ప ఆనందం అని. అదేవిధంగా, విజయం వైఫల్యం కూడా మానవ జీవితంలో రెండు అంశాలు. కాబట్టి దానిని అంగీకరించి లక్ష్యాల కోసం కృషి చేస్తూ ఉండాలి.
మనసా చిఞ్చితం కార్యం వాచా నైవ ప్రకాశయేత్ ॥
మన్త్రేణ రక్షయేద్ రహస్య కార్యం చాపి నియోజయేత్ ।
చాణక్య నీతి ప్రకారం ఏ పని నిర్ణయించుకున్నా, అది పూర్తయ్యే వరకు దాని గురించి ఎవరికీ చెప్పకూడదు. వ్యక్తి తన కలలను, లక్ష్యాలను ఎవరికీ వెల్లడించకూడదని ఆయన నమ్ముతాడు. బదులుగా, వాటిని దృష్టిలో ఉంచుకుని వాటిని నెరవేర్చుకోవడానికి కృషి చేయాలి.
*రూపశ్రీ.