చాణక్యుడు చెప్పిన మాట.. ఇలాంటి వారితో జీవించడం అంటే మరణం కంటే తక్కువ కాదట..!

 

చాణక్యుడు చెప్పిన మాట.. ఇలాంటి వారితో జీవించడం అంటే మరణం కంటే తక్కువ కాదట..!

ఆచార్య చాణక్యుడు ప్రపంచ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. ఆయన బోధించిన  నీతి శాస్త్రం,  ఆర్థిక శాస్త్రం, రాజనీతి,  తత్వశాస్త్రం మొదలైనవి నేటికి అనుసరించదగినవిగా ఉన్నాయి.  ఒక మనిషి జీవితం మరణం కంటే తక్కువ ఏమీ లేనంత దారుణంగా, మరణం లాంటి బాధను కలిగించే విధంగా కూడా ఉంటుందని, అది ఎలాంటి సందర్భాలలో కలుగుతుంది అనే విషయాన్ని ఆచార్య చాణక్యుడు స్పష్టంగా చెప్పాడు.  దీని గురించి తెలుసుకుంటే..


శ్లోకం..

రుష్టాభార్యా శత్మ్ మిత్రం భృత్యశ్చోత్తరదాయః ।
సంసర్ప్ చ గృహే వాసో మృత్యరేవ్ నః సంశయః

చాణక్య నీతి మొదటి అధ్యాయంలో పైన పేర్కొన్న శ్లోకం ఉంది. చెడు గుణాలు కలిగిన భార్యతో లేదా భర్తతో కలిసి జీవించడం అనేది మరణంతో సమానం అని ఆచార్య  చాణక్యుడు పేర్కొన్నాడు. అలాంటి వారితో జీవితం నరకప్రాయంగా ఉంటుందట,  అలాంటి భాగస్వామితో కలిసి ఉండటం కంటే విడిపోవడం మంచిదని ఆచార్య చాణక్యుడు చెబుతాడు.

అంతే కాకుండా.. కపట స్వభావం కలిగిన స్నేహితుడు లేదా ఆత్మీయుడు శత్రువు కంటే తక్కువేమీ కాదని కూడా ఆచార్య చాణక్యుడు చెబుతాడు.   అలాంటి వారు అబద్దాలకోరు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయట.  అబద్దాలు చెప్పే వ్యక్తి చెడు గుణాలు కూడా కలిగి ఉంటారు. అలాంటి వారితో స్నేహం, సన్నిహితంగా ఉండటం అస్సలు మంచిది కాదని,  తమకు తాముగా సమస్యలను సృష్టించుకోవడమే అవుతుందని అంటున్నారు.

ఇప్పటి బిజీ జీవితాలలో ఒక పనిమనిషిని లేదా ఒక సహాయకుడిని  పెట్టుకోవడం చూస్తూ ఉంటారు.  అయితే కోపంతో, అనుచిత ప్రవర్తనతో ఉండే పని వారు ఎప్పటికైనా ఏదో ఒక సమస్యను కలిగిస్తారని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు. అలాంటి వారితో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ముందు వెనుక ఆలోచించకుండా పని మనుషులను నియమించుకోకూడదు.

పైన పేర్కొన్న అందరూ పాముతో సమానం అని ఆచార్య చాణక్యుడు చెబుతాడు. ఎందుకంటే పాముతో కలిసి జీవించడం అంటే మరణాన్ని పక్కనే పెట్టుకుని జీవించడమే అనేది ఆచార్య చాణక్యుడి అబిప్రాయం.

                               *రూపశ్రీ.