ఇలాంటి సంపాదన వల్ల చివరకు వినాశనం తప్పదు..!

 

ఇలాంటి సంపాదన వల్ల చివరకు వినాశనం తప్పదు..!


 సంతోషకరమైన,  స్వావలంబన జీవితానికి ఆర్థికంగా బలంగా ఉండటం చాలా అవసరం. ప్రతి వ్యక్తి తన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి,  తన అవసరాలను తీర్చుకోవడానికి డబ్బు సంపాదిస్తాడు. కానీ కొంతమంది కష్టపడి పనిచేయడానికి బదులుగా సులభమైన మార్గాలలో డబ్బు సంపాదించడం ద్వారా త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారు. అలాంటి వ్యక్తులు  ధనవంతులు కావచ్చు. కానీ వారి సంపద నిలవదు,  వారు తరచుగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటారట.  ఈ మాటలు స్వయంగా గొప్ప చారిత్రక రాజనీతిని రచించిన ఆచార్య చాణక్యుడు చెప్పాడు.  ఎలాంటి సంపద మనిషిని నాశనం చేస్తుందో ఆచార్య చాణక్యుడు చెప్పాడు. దాని గురించి తెలుసుకుంటే..

చాణక్య శ్లోకం..

అన్యయోపర్జితం ద్రవ్య దష్ వర్షణి తిష్ఠతి.
ప్రాప్తే ఏకాదశే వర్షే సమూలం చ వినశ్యతి.

అర్థం..

అన్యాయం లేదా తప్పుడు మార్గాల ద్వారా సంపాదించిన డబ్బు గరిష్టంగా పదేళ్ల పాటు ఉంటుంది. అది పదకొండవ సంవత్సరంలో పూర్తిగా నాశనం అవుతుంది.  అనైతిక మార్గాల ద్వారా సంపాదించిన డబ్బు .. అంటే  నిజాయితీగా కాకుండా అన్యాయమైన లేదా మోసపూరిత మార్గాల ద్వారా సంపాదించిన డబ్బు క్షణిక ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది. అలాంటి డబ్బు  వ్యక్తి  మానసిక శాంతిని హరించడమే కాకుండా, భవిష్యత్తులో దుఃఖానికి కూడా కారణం అవుతుంది.

దొంగతనం లేదా మోసం ద్వారా సంపాదించిన డబ్బు ఎప్పుడూ స్థిరత్వాన్ని ఇవ్వదు. ఇది ఆధ్యాత్మిక సంతృప్తిని లేదా ఆనందాన్ని,  శాంతిని అస్సలు ఇవ్వదు. దొంగతనం ద్వారా డబ్బు సంపాదించడం వల్ల వ్యక్తి పతనానికి దారితీయడమే కాకుండా అతని కుటుంబం,  వంశపారంపర్యత కూడా దాని దుష్ప్రభావాలను అనుభవించాల్సి ఉంటుందని చాణక్యుడు పేర్కొన్నాడు.

ఎవరైనా ఇతరులను మోసం చేసి డబ్బు సంపాదిస్తే, అతని గౌరవం క్రమంగా పాతాళానికి పడిపోతుంది. సమాజం అలాంటి వారిని తృణీకరిస్తుంది. వారి సంబంధాలు క్షీణిస్తాయి.  చివరికి అలాంటి వ్యక్తులు  అప్పులు,  మానసిక ఒత్తిడితో నలిగిపోతాడు.


                           *రూపశ్రీ.