Read more!

కోటిదీపోత్సవంలో పాల్గొన్న కేంద్ర మంత్రి

 

 

భక్తి కోటి దీపోత్సవం నవంబర్ 3 వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఘనంగా జరుగుతోన్న కోటి దీపోత్సవం వేడుక.. సోమవారం సాయంత్రం.. శ్రీ  దత్తగిరి మహారాజ్ వేద పాఠశాల విద్యార్ధుల వేద పఠనంతో కోటి దీపోత్సవం ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రాంగణంలోని మహశివ లింగానికి ప్రదోషకాల అభిషేకం నిర్వహించారు. రామాచారి బృందంచే భక్తి గీతాలు, బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ వ్రవచనం, రాహుకేతు విగ్రహాలకు రాహుకేతు పూజ, చౌకీలపై నాగ ప్రతిమలకు భక్తులచే రాహుకేతు పూజ, శ్రీకాళస్తీశ్వర కల్యాణోత్సవం మరియు గజ వాహనంపై శ్రీ కాళహస్తీశ్వర స్వామి, సింహవాహనంపై శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక ఉత్సవ మూర్తుల ఊరేగింపు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

పీఠాధిపతులు.. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి ,దివ్య సాకేతం.. శ్రీ దేవనాధ జీయర్ స్వామి ,దివ్య సాకేతం.. శ్రీ స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి స్వామి, హరిహరపుర శ్రీశారదాలక్ష్మీనృసింహ పీఠం మరియు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పాల్గొన్నారు.