RELATED NEWS
NEWS
రీవాడ్స్ కార్డ్ ఆవిష్కరించిన డా గజల్ శ్రీనివాస్

 

రీవాడ్స్  కార్డ్ ఆవిష్కరించిన డా గజల్ శ్రీనివాస్

 


న్యూ జెర్సీ : ​నాట్స్ సభ్యులకు మెరుగైన సంక్షేమం, సదుపాయం కల్పించడంలో భాగంగా నాట్స్ అధ్యక్షులు మోహన కృష్ణ మన్నవ, ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్యాం మద్దాళి, నాట్స్ రివార్డ్ కార్డ్  లు పరిచయం చెయ్యగా, న్యూ జెర్సీ లో ఈ కార్డ్ ను ఆ సంస్థ నాట్స్ బ్రాండ్ అంబాసిడర్ డా. గజల్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిధిగా లయన్స్ అంతర్జాతీయ అధ్యక్షులు బారీ పామర్ పాల్గొన్నారు.

 

డా. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ కార్డు ద్వారా అమెరికా లోనే కాకుండా భారతదేశం మరియు ఇతర దేశాలలో కూడా అనేక వ్యాపార సంస్థలలో చేసిన కొనుగోలుపై నాట్స్ సభ్యులకు మంచి రాయితీలు లభిస్తాయని మరిన్ని వ్యాపార సంస్థలు నాట్స్ రివార్డ్ కార్డుపై డిస్కౌంట్ ఇవ్వడానికి ముందుకొస్తున్నాయని తెలిపారు.  ఈ కార్యక్రమంలో మధు కొర్రపాటి, దేశ్ గంగాధర్, బసవేంద్ర సూరపనేని, శ్రీమతి గంటి అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం న్యూజెర్సీలోని మన్విల్లె - రిథమ్స్ లో జరిగింది.


-------------------------------------


Dr Ghazal Srinivas launches NATS Rewards Card


 

​New Jersy: ​ As  a  part of providing better services to  NATS Members, NATS President Mohan Krishna Mannava and Trust Board Chairman Syam Maddali introduced NATS Rewards Card and it was launched by its Brand Ambassador Dr. Ghazal Srinivas in a grand ceremony held in Rhythms, Manville, New Jersy.  Mr Barry Palmer, President, Lions International graced the occasion as a  Guest of Honor.



Dr. Ghazal Srinivas said that  NATS Reward Card will give privilege of having discounts at many shopping malls not only in US but also in many countries. He also said ' Many Business Corporate  companies are willing to join NATS Reward Card  offer to give special  discounts.
 

Board of Directors of NATS  Dr Madhu Korrapati, Desu  Gangadhar, Bupavendhra Surapaneni and Smt. Ganti  Aruna were also present.

TeluguOne For Your Business
About TeluguOne
;