RELATED NEWS
NEWS
న్యూయార్క్ లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

న్యూయార్క్ లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం రోగులకు ఉచిత సేవలు, మందులు అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ న్యూయార్క్ లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసింది. రాబిన్ సన్ స్ట్రీట్ లోని శిరిడిసాయి ఆలయం వద్ద ఏర్పాటుచేసిన ఈ ఉచిత వైద్యశిబిరానికి భారతీయ వైద్యుల తమ సేవలను అందించేందుకు ముందుకొచ్చారు.. దాదాపు వంది మంది రోగులకు ఉచితంగా ఈ శిబిరంలో వైద్య సేవలు అందించారు. వీరిలో 52 మంది ఉచితంగా ప్లూషాట్స్ ఇచ్చారు. నీల్ మండవ, రాకేష్ దువా, దుర్గా మద్దినేని, అల్లూరి జగ్గారావులు ఈ ప్లూషాట్స్ ఎవరికి ఇవ్వాలి..? ఎవరికి అవసరమనేది వైద్య పరీక్షలు నిర్వహించి అందచేశారు.


డాక్టర్ మాధురి అడబాల, తరుణ్ వాసిల్, షెఫాలి లూధ్రలు అక్యు చెక్ ద్వారా  రోగులకు పరీక్షలు నిర్వహించారు. మహా లక్ష్మి వెనిగళ్ల , మల్లిక్  కాలేపు, జానకి కనుమిల్లి , హిమాన్షు పాండ్య , భారతి రెడ్డి మధు కొర్రపాటిలు  రోగులకు మధుమేహం, రక్తపోటులు  పరిశీలించి వారికి ఆరోగ్యపరమైన సలహాలు.. సూచనలు అందించారు.  ప్రముఖ దంతవైద్యులు డాక్టర్ దీప్తి గులివిందల, ఉదయిని పోతులమూడి  వైద్య శిబిరానికి వచ్చిన వారికి డెంటల్ చెక్ అప్ చేశారు. వీరిలో 18 మందికి డాక్టర్లు విలువైన సూచనలు అందించారు. దంత సమస్యల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.



ఇక గుండె జబ్బులపై కూడా నాట్స్ ఉచిత వైద్య శిబిరం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.  కార్డియాలిజిస్ట్ డాక్టర్ రాధా ఓలేటి, సునీతా కనికి పాటి లు 38 మంది రోగులకు ఉచిత వైద్య సేవలు అందించారు. భూపేష్ ధమ్మ అందించిన ఈకేజీ యంత్రంతో వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి.. వాటి ఆధారంగా వైద్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.



ఇక డాక్టర్ అనుపమ మండవ 30 మందికి  కంటి పరీక్షలు నిర్వహించి.. రోగులకు  విలువైన సూచనలు అందించారు. నాట్స్ ఉచిత వైద్య శిబిరాన్ని  మూర్తుల గులివిందల, డాక్టర్ పూర్ణ అట్లూరి, రాజ్ అల్లాడలు పర్యవేక్షించారు. వీరికి డాక్టర్ వెనిగళ్ల కూడా తమ వంతు సాయం అందించారు. ఈ వైద్య శిబిరానికి వచ్చిన వారిలో... 10 మంది పూర్తిగా మధుమేహం నియంత్రణలోనే ఉందని.. కొంతమంది గుండె జబ్బు ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలుసూచించారు..న్యూరాలిజిస్ట్  అల్లూరి జగ్గారావు ఓ రోగికి చిటికెన వేలికి పాల్సీచికిత్స చేశారు. ఉచిత వైద్య శిబిరానికి వచ్చే రోగుల వివరాలు..వారికి ఉన్న సమస్యలను డాక్టర్ ప్రాచి దువా, నిషికా వనంలు నమోదుచేశారు.



అటు ఆలయ సిబ్బంది కూడా ఈ ఉచిత వైద్య శిబిరానికి తమవంతు సాయం అందించారు.. డాక్టర్లకు అల్పాహారం అందించి.. వారు కూడా ఈ సత్కార్యంలో పాలుపంచుకున్నారు. సిడీ కామత్ , మిస్టర్ లూథర , శ్రీ మైసూర్ , సత్యం గులివిందలకు నాట్స్ ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలిపింది.



" మిమ్మల్ని మీరు కనుగొనడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే ఇతరుల సేవలో మిమ్మల్ని మీరు మరిచి పోవడమే "  అనే గాంధీ సూక్తినే ఆదర్శంగా తీసుకుని నాట్స్ అడుగులు వేస్తుందని.. నాట్స్ డిప్యూటీ ఛైర్మన్ మధుకొర్రపాటి అన్నారు. నాట్స్ ఇక ముందు మరిన్ని ఉచిత వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. .అమెరికాలో తెలుగువారికి ఏ ఆపద వచ్చినా నాట్స్ హెల్ఫ్ లైన్ కు సంప్రదించవచ్చని తెలిపారు.

TeluguOne For Your Business
About TeluguOne
;