English | Telugu

నామినేష‌న్స్ లో బిందు మాధ‌వి వింత‌ ప్ర‌వ‌ర్త‌న‌

బిగ్‌బాస్ నాన్ స్టాప్ రియాలిటీ షో మ‌రో మూడు వారాల్లో ముగియ‌బోతోంది. అయితే ఈ షోలో విన్న‌ర్ ఎవ‌ర‌న్న‌ది గ‌త కొన్ని వారాలుగా క్లారిటీ వ‌చ్చేసింది. ఎవ‌రిని అడిగిన ట‌క్కున్న బిందు మాధ‌వి పేరునే చెప్పేస్తున్నారు. ఇటీవ‌ల ఫ్యామిలీ మెంబ‌ర్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంద‌ర్బంలోనూ ఇదే విష‌యాన్ని అంతా ఇండైరెక్ట్ గా వెల్ల‌డించారు. అయితే సోమ‌వారం నామినేష‌న్స్ సమ‌యంలో బిందు మాధ‌వి ప్ర‌వ‌ర్తించిన దీరు మాత్రం విన్న‌ర్ అవుతుందా? అనే అనుమానాల్ని క‌లిగిస్తోంది. మూడు వారాలు.. రెండు నామినేష‌న్స్ .. ఈ గండం గ‌ట్టెక్కితే బిందునే బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్న‌ర్ కానీ బిందు వింత ప్ర‌వ‌ర్త‌న ఇప్ప‌డు అమెని రేస్ నుంచి వెన‌క్కి నెట్టేలా క‌నిపిస్తోంది.

ఎప్ప‌టిలాగే సోమ‌వారం నామినేష‌న్స్ రౌండ్ మొద‌లైంది. బాబా భాస్క‌ర్ కెప్టెన్ కావ‌డంతో ఈ వారం నామినేష‌న్స్ ఆయ‌న‌తో ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా శివ‌, అఖిల్ మ‌ధ్య పెద్ద ర‌చ్చే జ‌రిగింది. వీరిద్ద‌రి నామినేష‌న్స్ లో బిందు మాధ‌వి బాత్రూమ్ టాపిక్ మొద‌లై చిచ్చు పెట్టింది. బాత్రూమ్ టాపిక్ నువ్వు ఎందుకు ఎత్తావ్ అని శివ‌.. నువ్వు న‌వ్వ‌లేదా?.. ఆ టాపిక్ తీయ‌డానికి నీకు సిగ్గులేదా? అని అఖిల్ .. ఒకరిపై ఒక‌రు దారుణంగా సెటైర్లు వేసుకున్నారు. ఇక అరియానాని నామినేట్ చేస్తూ అషురెడ్డి లేని విష‌యాన్ని ఉంద‌ని ఊహించుకుంటోందంటూ చుర‌క‌లు అంటించింది.

ఇక ఈ నామినేష‌న్స్ లో బిందు మాధ‌వి చిత్ర విచిత్రంగా ప్ర‌వ‌ర్తించింది. మిత్ర‌ని నామినేట్ చేస్తూ.. చేతిలో చేదు ల‌డ్డూ పెడుతూ చేతిని త‌గిలించి బిగ్ బాస్ ఆమె న‌న్ను ట‌చ్ చేసింది. ఫిజిక‌ల్ అబ్యూస్ అంటూ మిత్ర‌ని రెచ్చ‌గొట్ట‌డం మొద‌లు పెట్టింది. మిత్ర ఎదురుదాడికి దిగ‌డంతో త‌నని ఇమిటేట్ చేస్తూ పిచ్చి పిచ్చి చేష్ట‌ల‌తో విచిత్రంగా ప్ర‌వ‌ర్తించింది బిందు. దీంతో మిత్ర‌కు ప‌ట్ట‌రాని కోపం వ‌చ్చేసింది. బిందు టైటిల్ విన్న‌ర్ అని ఒక‌వేళ ఎవ‌రైనా అనుకుంటున్నారంటే అది బిందు మాధ‌వి ఆడుతున్న హ్యాష్ ట్యాగ్ డ్రామా అంటూ బిందుకు దిమ్మ‌దిరిగే పంచ్ ఇవ్వడం విశేషం.