English | Telugu
`ఇంటింటి గృహలక్ష్మి` ఫుల్ సపోర్ట్ విశ్వక్‌సేన్ కే
Updated : May 5, 2022
గెటౌట్ అంటూ టీవీ 9 స్టూడియో నుంచి గెంటివేయబడ్డ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కు నెటిజన్ ల నుంచి మద్దుతు పెరుగుతోంది. ఐ సపోర్ట్ విశ్వక్ సేన్ అంటూ ట్వట్టర్ లో ఈ యువ హీరోకు చాలా మంది నెటిజన్స్ మద్దతు తెలుపుతున్నారు. ఇదే సందర్భంగా బ్యాన్ యాంకర్ దేవి అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. అంతే కాకుండా సదరు యాంకర్ పై వ్యక్తిగతంగా దూషణలకు దిగుతున్నారు. ఇదేనా జర్నలిజం అంటే స్టూడియోకి పిలిచి అవమానిస్తారా? అంటూ మండిపడుతున్నారు.
ఈ జాబితాలో `ఇంటింటి గృహలక్ష్మి` కస్తూరి చేరింది. నటిగా వెండితెరపై అలరించిన కస్తూరి ఇటీవలే `స్టార్ మా`లో ప్రసారం అవుతున్న ఇంటింటి గృహ లక్ష్మి సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకుల ముందుకొచ్చింది. గత కొన్ని నెలలుగా ఈ సీరియల్ మహిళా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రసారం అవుతోంది. ఇటీవలే ఈ సీరియల్ లోకి మరో నటి సితార కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఇద్దరు కలిసి ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నారు.
ఇదిలా వుంటే తాజాగా విశ్వక్ సేన్ పై టీవీ ఛానల్ యాంకర్ లైవ్ టిబేట్ కి పిలిచి అవమానించడం గమనించిన కస్తూరి దీనిపై మండిపడింది. విశ్వక్ సేన్ కు మద్దతుగా నిలిచింది. నేను హిట్ సినిమా చూసినప్పటి నుంచి విశ్వక్ సేన్ ను ఇస్టపడుతున్నాను. ఈ రోజు ఓ వీడియో చూశాను. దాంతో అతనిపై మరింత గౌరవం పెరిగింది. అసలు ఏ ప్రాంక్ చేసినా కూడా రానంత పబ్లిసిటీ టీవి9 క్రియేట్ చేసింది. ఆల్ ది బెస్ట్ సెల్ఫ్ మేడ్ స్టార్ విశ్వక్ సేన్.. నీ కొత్త సినిమా `అశోకవనంలో అర్జున కల్యాణం` చిత్రానికి కూడా ఆల్ ది బెస్ట్` అంటూ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా విశ్వక్ సేన్ కు మద్దతుగా నిలిచింది `ఇంటింటి గృహలక్ష్మి` కస్తూరి.