English | Telugu
అభిమన్యుకి వేద సీరియస్ వార్నింగ్
Updated : May 3, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. ఏడేళ్ల క్రితం హిందీలో రూపొంది విజయవంతమైన సీరియల్ `యే హై మొహబ్బతే` ఆధారంగా ఈ సీరియల్ ని రీమేక్ చేశారు. దివ్యాంక టి. దహియా, కరణ్ పటేల్ జంటగా నటించారు. ఇదే సీరియల్ తెలుగు రీమేక్ లో నిరంజన్, డెబ్జాని మోడక్, మిన్ను నైనిక కీలక పాత్రల్లో నటించారు. బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, ఆనంద్, ప్రణయ్ హనుమండ్ల ఇతర పాత్రలు పోషించారు. గత కొన్ని వారాలుగా విజయవంతంగా ప్రసారం అవుతోంది. ఓ పాప కోసం ఓ తల్లి కాని తల్లి పడే ఆరాటం నేపథ్యంలో ఈ సీరియల్ ని రూపొందించారు.
మంగళవారం ఎపిసోడ్ వివరాలేంటో ఒకసారి చూద్దాం. ఖుషీ కోసం వేదతో కలిసి స్కూల్ కి వెళ్లిన యష్ అక్కడ పేరెంట్స్ కి స్కూల్ టీమ్ పెట్టిన ఓ గేమ్ లో పార్టిసిపేట్ చేస్తారు. తమ భార్యలని అందంగా భర్తలు అలంకరించాలన్నది టాస్క్. ఈ టాస్క్ లో యష్, వేదని అందంగా అలంకరించి ముస్తాబు చేస్తాడు. ఇది అందరికి నచ్చుతుంది. దీంతో యష్ - వేదల జంట ఈ టాస్క్ లో విన్నవుతారు. గెలిచిన ఆనందంలో తిరిగి ఇంటికి వస్తున్న వీరిని కొంత మంది అగంతకులు దాడికి దిగుతారు.
కార్ కి అడ్డంగా పడుకుని ఓ దొంగ డ్రామాలాడుతుంటే నిజమని నమ్మి యష్ అతని దగ్గరికి వెళతాడు. అదను చూసి ఆ వ్యక్తి కత్తితో యష్ ని ఎటాక్ చేస్తూ డబ్బు, ఒంటిపై వున్న చైన్ రింగ్ ఇచ్చేయమంటాడు. ఇంతలో మరి కొంత మంది గ్యాంగ్ యష్ ని చుట్టుముడతారు. విషయం అర్థం చేసుకున్న యష్ .. వేదకు ఖుషీ జాగ్రత్త అని చెప్పి రౌడీలని చెడుగుడు ఆడేస్తాడు. ఈ క్రమంలో యష్ చేతికి గాయం అవుతుంది. ఇంటికి వెళ్లాక కట్టు కట్టిన వేద యష్ కి టాబ్లెట్స్ ఇస్తుంది. కొంచెం ఓవర్ గా లేదూ అని యష్ అనడంతో నా భర్త గురించి ఆ మాత్రం వుంటుంది లే అంటుంది.
కట్ చేస్తే ఈ దాడికి కారణం అభిమన్యు అని తెలుస్తుంది. విషయం తెలిసిన వెంటనే అభిమన్యుకు వార్నింగ్ ఇస్తుంది వేద. అనవసరంగా ఆరోపణలు చేస్తున్నావ్ అంటాడు అభిమన్యు. ఇలాంటి నీచుడి కోసమా నీ భర్తకు ద్రోహం చేస్తున్నావ్ మాళవిక. నీ జీవితం ఎంత అంధకారం అవుతుందో నీకు ఇప్పడు తెలియదు.. కనీసం నిన్ను పెళ్లి చేసుకుంటానని కూడా ఈ అభిమన్యు అనడం లేదు.. ఆ టాపకే తీసుకురావడంలేదు. అని మాళవిక కళ్లు తెరిపించే ప్రయత్నం చేస్తుంది వేది.. వేద మాటలు విన్న మాళవిక వెంటనే ఆలోచనలో పడి నిజమే కదా అని అభిమన్యు కాలర్ పట్టుకుంటుంది.. ఆ తరువాత ఏం జరిగింది? అభిమన్యు మళ్లీ ఎలాంటి మాయ చేశాడు అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.