English | Telugu
రాకింగ్ రాకేష్.. జోర్దార్ సుజాత.. ఏం జరుగుతోంది?
Updated : May 4, 2022
జబర్దస్త్ కామెడీ షో ప్రేమ జంటలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. ఇప్పటికే ఈ షో ద్వారా సుడిగాలి సుధీర్ - రష్మీ గౌతమ్ క్రేజీ జోడీగా పాపులర్ అయ్యారు. ఎంతో మంది ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నారు. ఈ స్టేజ్ పై సుడిగాలి సుధీర్ - రష్మీల మధ్య స్కిట్ అంటే అది నెట్టింట ఓ రేంజ్ లో పేలుతూ వస్తోంది. తాజాగా ఈ షో లో మరో జంట వార్తల్లో నిలవడం మొదలైంది. అదే జోర్దార్ సుజాత - రాకింగ్ రాకేష్. ఈ మధ్యే వీరిద్దరు కలిసి స్కిట్ లు చేయడం మొదలు పెట్టారు. కామెడీ స్టార్స్ నుంచి బయటికి వచ్చేసిన సుజాత ఫైనల్ గా రాకింగ్ రాకేష్ తో కలిసి స్కిట్ లు చేస్తోంది.
ఇక్కడే వీరి మధ్య మంచి స్నేహం మొదలైంది. తాజాగా రాకేష్ కోసం సుజాత కాస్ట్లీ గిఫ్ట్ ని ఇవ్వడం ఇప్పడు ఆక్తికరంగా మారింది. ఈ జంట గత కొంత కాలంగా ప్రేమలో మునిగితేలుతున్నారు. జబర్తస్త్ వేదిక సాక్షిగా తమ ప్రేమ బంధాన్ని, లవ్ స్టోరీని బయటపెట్టి షాకిచ్చారు. అప్పటి నుంచి వీరి రచ్చ ఓ రేంజ్ లో సాగుతూనే వుంది. సరదాగా వుంటూనే ఒకరిపై ఒకరికి వున్న ప్రేమని తెలియజేస్తున్నారు. తాజాగా రాకింగ్ రాకేష్ కి కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చి సుజాత సర్ ప్రైజ్ చేసింది. లక్ష రూపాయల విలువైన స్మార్ట్ ఫోన్ ని అతనికి గిఫ్ట్ గా ఇచ్చింది. గిఫ్ట్ చూసి ఎమోషనల్ అయిన రాకింగ్ రాకేష్ నమ్మలేకపోన్నానంటూ ఎమోషనల్ అయ్యాడు.
సుజాత ఫోన్ గిప్ట్ గా ఇవ్వడాన్ని మొదట రాకేష్ నమ్మలేదట. జోక్ చేస్తుందని భావించాడట. కానీ ఆమె సీరియస్ గానే ఇస్తున్నట్టు చెప్పడంతో రాకేష్ నోట మాట రాదట. అలాగే తనని, ఫోన్ ని చూస్తూ వుండిపోయాడట. లక్షా 20 వేల రూపాయల విలువ చేసే సామ్ సాంగ్ ఫోన్ ని గిఫ్ట్ గా ఇవ్వడాన్ని తాను ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నాడట. ఇదే ఫోన్ ను సుజాత తనకోసం కొనుక్కుంటానంటే వద్దని వారించిన రాకింగ్ రాకేష్ ఏకంగా ఆ ఫోన్ ని తనకే ఇవ్వడంతో మరింత షాక్ కు గురయ్యాడట. షాక్ నుంచి తేరుకున్న రాకేష్ .. సుజాత తనకు బెంజికారు కొనిచ్చే స్థాయికి ఎదగాలని కోరుకున్నాడట.