English | Telugu
బిగ్ బాస్ 6 కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ లోడింగ్
Updated : May 4, 2022
బిగ్ బాస్ నాన్ స్టాప్ గ్రాండ్ ఫినాలేకి రెడీ అవుతోంది. త్వరలోనే టాప్ 5 ఫైనల్ కాబోతోంది. అంతే కాకుండా మరో మూడు వారాల్లో ఓటీటీ సీజన్ కి ఎండ్ కార్డ్ పడబోతోంది. ప్రస్తుతం హౌస్ లో వున్న 9 మంది కంటెస్టెంట్ లలో బిందు మావి టైటిల్ రేస్ లో దూసుకుపోతోంది. అఖిల్ సీజన్ 4 లో రన్నర్ గా మిగిలినట్టే ఈ ఓటీటీ వెర్షన్ లోనూ వెనకబడే వున్నాడు. ఈ సారి కూడా తను విజేత కాలేడన్నది తేలిపోయింది. ఇదిలా వుంటే బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ ని ప్రకటించకుండానే సీజన్ 6 కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవలే కంటెస్టెంట్ ల వేట కూడా మొదలైనట్టుగా చెబుతున్నారు.
అంతే కాకుండా దాదాపుగా కంటెస్టెంట్స్ ని కూడా సైలెంట్ గా ఫైనల్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే వేదికగా నాన్ స్టాప్ ఓటీటీ వెర్షన్ కి సంబంధించిన ప్రకటన చేశారో అదే విధంగా ఈ నాన్ స్టాప్ ఓటీటీ గ్రాండ్ ఫినాలే వేదికగా సీజన్ 6 ని ప్రకటించే అవకాశం వుందని తెలిసింది. సీజన్ 6 ఎప్పుడు ప్రారంభించబోతున్నారనే విషయాన్ని స్వయంగా నాగార్జున వెల్లడించనున్నారట. ఇక సీజన్ 6 కి కూడా నాగార్జననే హోస్ట్ గా వ్యవహరించనున్నారట. ఇంతకీ సీజన్ 6 కంటెస్టెంట్స్ గా ఎవరు రాబోతున్నారన్నది ఇప్పడు ఆసక్తిగా మారింది.
బగ్ బాస్ నాన్ స్టాప్ లో ఇప్పటికే బెస్ట్ పెర్ఫార్మార్ గా పేరు తెచ్చుకున్న యాంకర్ శివ సీజన్ 6 లోకి అడుగుపెట్టబోతున్నాడట. ఇక అఖిల్, అషురెడ్డి, బాబా భాస్కర్ ఇప్పటికే బిగ్ బాస్ లోకి వచ్చి వెళ్లారు కాబట్టి వారికి ఛాన్స్ లేదు. అయితే ఇక మిగిలిన కంటెస్టెంట్ లు ఎవరు? అన్నది ఇప్పడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. సుమన్ టీవి యాంకర్లు రోషన్, మంజూష ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక వీరితో పాటు చాలా మంది యూట్యూబ్ స్టార్లు, యాంకర్ల పేర్లు ప్రచారంలో వున్నాయి. అంతే కాకుండా ఈ సీజన్ లో ఓ కామన్ మెన్ కి కూడా అవకాశం ఇవ్వబోతున్నారని తెలిసింది. ఆ కామన్ మెన్ ఎవరుంటారో చూడాలి.