English | Telugu
యష్ - వేదల మధ్య చిత్ర ప్రేమ రగడ
Updated : May 5, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. ఏడేళ్ల క్రితం వచ్చిన హిందీ సూపర్ హిట్ సీరియల్ `యోహే మొహబ్బతే` ఆధారంగా ఈ ఈ సీరియల్ ని రీమేక్ చేశారు. నిరంజన్, డెబ్జాని మోడక్ ప్రధాన జంటగా నటించగా కీలక పాత్రల్లో బేబీ మిన్ను నైనిక, ప్రణయ్ హనుమండ్ల, రాజా శ్రీధర్, బెంగళూరు పద్మ, అనంద్, మీనాక్షి తదతరులు నటించారు. గత కొన్ని వారాలుగా విజయవంతంగా సాగుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ రోజు హైలైట్స్ ఏంటో చూద్దాం.
యష్ బిజినెస్ పార్ట్నర్ తన చెల్లెలిని మీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నానని అంటాడు. ఇందుకు యష్ నాకు కొంచెం టైమ్ కావాలి అంటాడు. అలాగే వసంత్ ని కూడా కనుక్కుంటానని చెబుతాడు. దీంతో హ్యాపీగా ఫీలైన దామోదర్ రావు బిజినెస్ లో యష్ కు మరింత అండగా వుంటానంటాడు. దాంతో యష్ ఎలాగైనా ఆనంద్ ని పెళ్లికి ఒప్పించాలని నిర్ణయించుకుంటాడు. కట్ చేస్తే ...వేద మాత్రం వసంత్ కు చిత్ర కు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నానని యష్ తో చెబుతుంది. అది ఎట్టపరిస్థితుల్లో జరగదని యష్ అంటే జరిగేలా చేస్తానని వేద ఛాలెంజ్ చేస్తుంది.
ఇద్దరి ప్రేమను మీ బిజినెస్ కోసం బలిచేయవద్దంటుంది. అయినా నువ్వెరు నాకు చెప్పడానికి గెట్ ఔట్ అంటూ వేదపై అరుస్తాడు యష్. ఆ తరువాత జరిగిన విషయాన్ని వసంత్ కు చెబుతాడు. అంతే కాకుండా దామోదర్ రావు చెల్లెలిని కలవమంటాడు. ఆ తరువాత వేద తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి ఓ బిజినెస్ పని మీద నా బిజినెస్ పార్ట్నర్ చెల్లెలు ఇక్కడికి వస్తోందని, అమెని కొన్ని రోజుల పాటు మీ ఇంట్లో వుండనివ్వాలని చెబుతాడు. ఇది గమనించిన వేద .. చిత్ర నువ్వు ఏ విషయంలో వెనక్కి తగ్గొద్దని నీ ప్రేమకు నేనున్నానని చెబుతుంది. దీంతో వేద - యష్ ల మధ్య చిత్ర ప్రేమ రగడని సృష్టిస్తుంది. ఆ తరువాత ఏం జరిగిందన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.