English | Telugu
జ్వాలపై శివాలెత్తిన సౌందర్య
Updated : May 3, 2022
బుల్లితెరపై ప్రసారం అవతున్న సీరియల్ `కార్తికదీపం`. గత కొన్ని నెలలుగా గాడి తప్పిన ఈ సీరియల్ తాజాగా మళ్లీ ట్రాక్ లోకి వచ్చేస్తోంది. డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలని ఎండ్ చేసిన దర్శకుడు వారి పిల్లలతో కొత్త కథ మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఈ సీరియల్ విజయవంతంగా సాగుతోంది. ఈ మంగళవారం ఎపిసోడ్ విశేషాలేంటో ఒకసారి చూద్దాం. పార్శిల్స్ డెలివరీ కోసం వచ్చిన జ్వాల .. సౌందర్య కనిపించగానే మీ మనవరాలు బొమ్మ సంగతి ఎక్కడి దాకా వచ్చింది అని అడుగుతుంది. ఆర్టిస్ట్ ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. నేనే స్వయంగా వెళ్లి తీసుకురావాలి అంటుంది.
ఆ మాటలు విన్న జ్వాల.. నేను మీ మనవరాలని నాకు చెప్పాలని అనిపించినప్పుడే నీ దగ్గరకు వస్తాను అని మనసులో అనుకుంటుంది. ఇక సౌందర్య అక్కడి నుంచి ఆర్టిస్ట్ దగ్గర బొమ్మ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తుంది. దాంతో జ్వాల నానమ్మ నా బొమ్మను ఎక్కడ చూస్తుందో అనే భయంతో తను కూడా వెళుతుంది. సౌందర్య నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడగగా.. మేము కూడా బొమ్మ గీయిస్తున్నాం అని జ్వాల అంటుంది. ఆ తరువాత సౌందర్య .. గీత కోసం వెళ్లగా గీత అన్నీ ఖాళీ చేసి వెళ్లిపోయింది అని తెలుస్తుంది. ఇక మనవరాలి మీద ప్రేమ కన్నా మనవరాలి బొమ్మతోనే ఎక్కువ అవసరం ఉన్నట్టుంది అని జ్వాల అంటుంది. దాంతో సౌందర్య .. జ్వాలపై మండిపడుతుంది. నా ముందు నుంచి వెళ్లిపో అంటూ శివాలెత్తుతుంది.
కట్ చేస్తే జ్వాల ఇంట్లో తన కోసం హిమ ఎదురుచూస్తూ వుంటుంది. ఇంటికి చేరుకున్న జ్వాల.. ఆ ఆర్టిస్ట్ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయిందట ఇక పాత కాగితాలు అన్నీ చెత్త పేపర్లు కొనే వాడికి ఇచ్చేశారు అని చెబుతుంది. దీంతో హిమ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటుంది. సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. మరో వైపు నిరుపమ్ .. హిమకు తన ప్రేమని చెప్పే విషయంలో జ్వాల సహాయం తీసుకోవాలనుకుంటాడు. అనుకున్న వెంటనే జ్వాలకు కాల్ చేస్తాడు. ఆ తరువాత ఏం జరిగింది? .. కథ ఏ మలుపు తిరిగింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.