English | Telugu

త్వరలో డాన్స్ ఇండియా డాన్స్ ఆడిషన్స్ షురూ

జీ తెలుగు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ నాన్ స్టాప్ వినోదాన్ని అందిస్తూనే ఉంటుంది. టాలెంట్ ఉన్న వాళ్ళను గుర్తించి వాళ్ళ కోసం వేదికను కూడా సిద్ధం చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే  హిందీలో పాపులర్ ఐన డాన్స్ ఇండియా డాన్స్ షో ఇప్పుడు తెలుగులో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమౌతోంది. ఈ షో ఇప్పటికే చాలా భాషల్లో ప్రసారమై మంచి విజయాన్ని అందుకుంది కూడా. ఇప్పుడు ఈ జీ వేదిక ద్వారా న్యూ టాలెంట్ హంట్ కి సిద్దమయ్యింది తెలుగు డాన్స్ ఇండియా డాన్స్. దీనికి గాను రెండు తెలుగు రాష్ట్రాల నుంచి టాలెంట్ ఉండి వేదిక లేక ఇబ్బంది పడుతున్న అద్భుతమైన డాన్సర్స్  కోసం ఆడిషన్స్ నిర్వహించడానికి సన్నద్ధమయ్యింది.  

ఢీ షోకు ప్ర‌దీప్ గుడ్ బై.. ఏం జ‌రిగింది?

వెండితెర‌పై గ్రాఫిక్స్ చిత్రాల‌కు శ్రీ‌కారం చుట్టిన శ్యామ్ ప్ర‌సాద‌రెడ్డి ఆగ్ర‌హం, అమ్మోరు, అంజి, అరుంధ‌తి వంటి చిత్రాల‌ని నిర్మించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ల‌ని సొంతం చేసుకున్నారు. అయితే `అంజి` నిర్మాణం చాలా ఏళ్లు జ‌ర‌గ‌డం.. రిలీజ్ కు టైమ్ ప‌ట్ట‌డం వంటి కార‌ణాల‌తో ఈ మూవీ వ‌ల్ల భారీగా న‌ష్ట‌పోవాల్సి వ‌చ్చింది. దీంతో సినిమా నిర్మాణం ప‌క్క‌న పెట్టి మ‌ల్లెమాల ఎంట‌ర్ టైన్ మెంట్స్ లో బుల్లితెర‌పై టీవీ షోలు చేయ‌డం మొద‌లు పెట్టారు. `మ‌న‌సు మ‌మ‌త` సీరియ‌ల్ తో వీర జ‌ర్నీ మొద‌లైంది. జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్, ఢీ షోల‌తో పాపుల‌ర్ అయ్యారు.