English | Telugu

తులసి అంకితను ఇంట్లోకి రానిస్తుందా ?

పెట్టె సర్దేసుకుని అంకిత తులసి ఇంటికి వచ్చేస్తుంది. దీంతో పరంధామయ్య, దివ్య, అనసూయ ఆశ్చర్యపోతారు. వంట గదిలో ఉన్న తులసి కూడా అంకితను చూసి నివ్వెరపోతుంది. ఇలా పెట్టెతో ఎందుకు వచ్చిందో అర్థంకాదు. మీరు ఇంటికి రావద్దన్నారు ఆంటీ కానీ తప్పని పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది అంటుంది అంకిత. దయచేసి మీ మనసు మార్చుకోండి అంటూ ప్రాధేయపడుతుంది అంకిత. మీరు తీసుకున్న నిర్ణయానికి శిక్ష నన్ను అనుభవించమంటారా ఆంటీ అంటుంది అంకిత. అసలేం జరిగింది ..ఒక్కదానివే వచ్చావేంటి ? అని అడుగుతాడు పరంధామయ్య. ఆ ఇంట్లో నాకు స్వేచ్ఛ లేదు..నన్ను మనిషిలా కూడా చూడడం లేదు అంటూ బాధపడుతుంది అంకిత. ఆస్తి నా పేరు మీద రాసినా నాకు స్వేచ్ఛ లేదు వాళ్లకు నచ్చినట్టు ఆడాల్సి వస్తోంది. ఇప్పుడు మీ కొడుకు కూడా వాళ్ళ వైపే చేరిపోయాడు.

ఇంకా అక్కడ నేనెందుకు ఉండాలి. అందుకే నా దారి నేను చూసుకున్నా. మీ ఇంటికి వచ్చేసా అంటుంది అంకిత. భర్తను వదిలేసి వచ్చావు నువ్వు అంటుంది తులసి. నేను అభిని వదిలేసి రాలేదు. తాను నాతో రావడానికి సిద్ధంగా లేడు. అభికి బాగా స్వార్ధం పెరిగిపోయింది. ఆడదానికి ఒక రూలు, మగాడికో రూలా అని ప్రశ్నిస్తుంది. మరో వైపు ఇంటి అద్దె ఇంకా ఇవ్వలేదేమిటి అంటూ నందుని ప్రశ్నిస్తాడు ఇంటి ఓనర్. రెండు రోజుల్లో ఇస్తానంటాడు. ఇలా ఇంకోసారి లేట్ ఐతే ఊరుకోను అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు అంకిత.. నువ్వు ఆ ఇంటి నుంచి ఇలా వచ్చేయడం వల్ల సమస్య తీరకపోగా, ఇంకా ఎక్కువ సమస్యలు వస్తాయంటుంది తులసి. అప్పుడు పరంధామయ్య అడిగిన ప్రశ్నకు తులసి ఏమని సమాధానం ఇస్తుంది అనే విషయం ఈ రోజు సాయంత్రం ప్రసారమయ్యే గృహలక్ష్మి సీరియల్ లో తెలుసుకోవచ్చు.