English | Telugu

అన‌సూయ‌కు చ‌లాకీ చంటి ఇచ్చిన మూలిక ఏంటి?

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న కామెడీ షో `జ‌బ‌ర్ద‌స్త్‌`. గ‌త కొంత కాలంగా ఈటీవీలో మ‌ల్లెమాల ఎంట‌ర్ టైన్ మెంట్స్ అందిస్తున్న ఈ షో హాస్య ప్రియుల్ని క‌డుపుబ్బా న‌వ్విస్తూ టాప్ టీఆర్పీని సొంతం చేసుకుంటోంది. ఈ షోకు సంబంధించిన తాజా ప్రోమో విడుద‌లైంది. ఈ నెల 23 గురువారం ప్ర‌సారం కానున్న తాజా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఇది. సింగ‌ర్ మ‌నో, ఇంద్ర‌జ న్యాయ నిర్ణేత‌లుగా, అన‌సూయ యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ ఎపిసోడ్ కు `చోర్ బ‌జ‌ర్` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న హీరో ఆకాష్ పూరి, గెహ‌నా సిస్పీ హాజ‌ర‌య్యారు. చ‌లాకీ చంటి, రాకింగ్ రాఘ‌వ‌, నూక‌రాజు, తాగుబోతు ర‌మేష్‌, కొమురం త‌మ‌దైన స్కిట్ ల‌తో ఆక‌ట్టుకున్నారు. అన‌సూయ టీచర్ గా అవ‌తారం ఎత్తేసింది. స్టూడెంట్స్ ని ఇబ్బంది పెట్టాల‌ని ట్రై చేస్తే అన‌సూయ‌పై పంచ్ లు వేశారు. ఇక ఈ షోలో గెస్ట్ గా పాల్గొన్న ఆకాష్ పూరి `బేబీ జ‌బ్ త‌క్ తూ మేరీ సాత్ హోనా ఇస్‌ దునియాకో మిట్టీమే మిలాదూంగా..అబ్ తూ దేక్ లేగా బ‌చ్చ‌న్ సాబ్ కా ఖేల్‌..` అంటూ చెప్పిన డైలాగ్ కి అంతా విజిల్స్ వేసి గోల చేశారు.

అయితే ఇక్క‌డే చ‌లాకీ చంటీ అన‌సూయ‌పై వేసిన పంచ్ ఓ రేంజ్ లో పేలింది. మూలిక‌లు అమ్ముకునే వ్యక్తిగా స్కిట్ చేయ‌డానికి ఎంట్రీ ఇచ్చిన చ‌లాకీ చంటి `నా ద‌గ్గ‌ర అన్నీ మూలిక‌లు వున్నాయ్ చిన్న‌ది వుంది పెద్ద‌ది వుంది అంటుంటే మ‌ధ్య లో మ‌నో అందుకుని అది దొరుకుతుందా? అంటే లాస్ట్ టైమ్ మీకు పెద్ద‌ది ఇచ్చిన అన్నాడు. ఇక నాకు అందం బాగా పెరుగుతోంది.. ఆ అందం త‌గ్గ‌డానికి ఏదైనా మూలిక కావాల‌ని అడిగారొక‌రు.. వెంట‌నే ఒక మూలిక ఇచ్చి అందం పెరుగుతుంద‌న్న భ్ర‌మ త‌గ్గిపోతుంది పో అని చెప్పా అని చ‌లాకీ చంటి అన‌గానే ` ఆ మూలిక అడిగింది అన‌సూయ గారే క‌దా` స‌ర్ అంటూ నూక‌రాజు ట‌క్కున చెప్ప‌డంతో అక్క‌డున్న వారంతా పెద్ద‌గా న‌వ్వేశారు.