English | Telugu
తగ్గేదేలే.. 'అన్ స్టాపబుల్' సీజన్-2 అప్డేట్ వచ్చేసింది
Updated : Jun 20, 2022
నటసింహం నందమూరి బాలకృష్ణ ఓటీటీ వేదిక ఆహాలో 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' పేరుతో చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఈ టాక్ షోతో మొదటిసారి హోస్ట్ గా మారిన బాలయ్య.. తనదైన కామెడీ టైమింగ్, ఎనర్జీతో ఆకట్టుకున్నారు. ఒకప్పుడు బాలయ్యను అభిమానించని వాళ్ళు కూడా ఈ షోతో ఆయనకు అభిమానులుగా మారిపోయారు. అంతలా ఈ షోతో మెప్పించారు బాలయ్య. దీంతో 'అన్ స్టాపబుల్' సీజన్-2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా సీజన్-2 కి సంబంధించిన అప్డేట్ వచ్చింది.
'అన్ స్టాపబుల్' సీజన్-2 త్వరలోనే రాబోతోంది అంటూ తాజాగా ఆహా సంస్థ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఈసారి భారీగా, మరింత క్రేజీగా రాబోతున్నట్లు చెప్పింది. ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా గుర్తింపు తెచ్చుకున్న మీ ఫేవరెట్ షో 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' రెండో సీజన్ త్వరలోనే రాబోతుందని తెలిపింది. ఈ ట్వీట్ కి తెలుగు ఇండియన్ ఐడల్ షో స్పెషల్ ఎపిసోడ్ లో 'అన్ స్టాపబుల్' గురించి బాలయ్య మాట్లాడిన వీడియో క్లిప్ ని జత చేసింది. ఆ వీడియోలో "అన్ స్టాపబుల్ సీజన్-2 ఎప్పుడు?" అని శ్రీరామ చంద్ర అడగగా.. "మధుర క్షణాలకు ముగింపు ఉండదు.. కొనసాగింపే" అంటూ బాలయ్య తనదైన శైలిలో సమాధానం చెప్పాడు.