English | Telugu
త్వరలో డాన్స్ ఇండియా డాన్స్ ఆడిషన్స్ షురూ
Updated : Jun 20, 2022
జీ తెలుగు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ నాన్ స్టాప్ వినోదాన్ని అందిస్తూనే ఉంటుంది. టాలెంట్ ఉన్న వాళ్ళను గుర్తించి వాళ్ళ కోసం వేదికను కూడా సిద్ధం చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే హిందీలో పాపులర్ ఐన డాన్స్ ఇండియా డాన్స్ షో ఇప్పుడు తెలుగులో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమౌతోంది. ఈ షో ఇప్పటికే చాలా భాషల్లో ప్రసారమై మంచి విజయాన్ని అందుకుంది కూడా. ఇప్పుడు ఈ జీ వేదిక ద్వారా న్యూ టాలెంట్ హంట్ కి సిద్దమయ్యింది తెలుగు డాన్స్ ఇండియా డాన్స్. దీనికి గాను రెండు తెలుగు రాష్ట్రాల నుంచి టాలెంట్ ఉండి వేదిక లేక ఇబ్బంది పడుతున్న అద్భుతమైన డాన్సర్స్ కోసం ఆడిషన్స్ నిర్వహించడానికి సన్నద్ధమయ్యింది.
డాన్స్ మీద ఇంటరెస్ట్ ఉన్నవాళ్లు ఆరేళ్ళ వయసు నుంచి 60 ఏళ్ళ వాళ్ళ వరకు ఎవ్వరైనా సరే ఈ ఆడిషన్స్ కి రావొచ్చు . జూన్ 23 న వరంగల్, ఖమ్మం జూన్ 24 న కర్నూల్, విజయవాడ, జూన్ 26 తిరుపతి, వైజాగ్ లో జరిగే ఆడిషన్స్ లో పాల్గొనవచ్చు. డాన్స్ అంటే ఇంటరెస్ట్ ఉండి రాలేని వాళ్ళు డిజిటల్ ఆడిషన్స్ లో పాల్గొనే అవకాశాన్ని కూడా కల్పించింది. దీని కోసం ఆసక్తి ఉన్నవాళ్లు వాళ్ళ డాన్స్ వీడియోని షూట్ చేసి 9154984009 నెంబర్ కి వాట్సాప్ చేయొచ్చని చెప్పింది. లేదంటే did.zeetelugu@gmail.com కి మెయిల్ చేయాలి. ఇంకా "didtelugu.zee5.com సైట్ లో లాగ్ ఇన్ అయ్యి దీని ద్వారా మీ వీడియోలను పంపొచ్చు.