English | Telugu
ఇది నా ఫస్ట్ ఫాదర్స్ డే అంటున్న అలీ రెజా
Updated : Jun 20, 2022
అలీ రెజా పేరు వింటే ఎవ్వరైనా ఇట్టే గుర్తుపట్టేస్తారు. 2019 లో ప్రసారమైన బిగ్ బాస్ 3 ఫేమ్. ఈ షో ద్వారా అలీ రెజా కి మంచి పేరు వచ్చింది. మధ్యలో ఎలిమినేట్ ఐనా కూడా మళ్ళీ తర్వాత హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ వచ్చింది. టైటిల్ కోసం గట్టి పోటీ ఇచ్చారు. బిగ్ బాస్ తర్వాత నాగార్జున యాక్షన్ మూవీ వైల్డ్ డాగ్ లో అలీ రెజా మంచి స్కోప్ ఉన్న పాత్రలో నటించి ఇలాంటి పాత్రల్లో కూడా నటించగలడు అని పేరు తెచ్చుకున్నాడు. తర్వాత కొంత కాలానికి అలీ రెజా ఒక పాపకు తండ్రయ్యాడు. అప్పట్లో పాప ముఖం చూపించకుండా "అందమైన దేవతకు తండ్రినయ్యానంటూ " పోస్ట్ పెట్టాడు. ఇక ఇప్పుడు ఫాథర్స్ డే ని పురస్కరించుకుని నేను నా కూతురు పుట్టాక జరుపుతున్న ఫస్ట్ ఫాథర్స్ డే అంటూ కూతురిని ముద్దులాడుతున్న ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీ లో పోస్ట్ చేసాడు అలీ.
" తండ్రిని ఐనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా కూతురికి ఎన్నో కృతజ్ఞతలు చెప్పాలి... రోజూ నా జీవితంలో ఎన్నో సంతోషాలను తెస్తుంది " అంటూ పోస్ట్ చేశారు. అలీ రెజా కొన్ని తెలుగు సీరియల్స్ లో యాక్ట్ చేసి పేరు తెచ్చుకున్నాడు. ఒక పక్కన నటుడిగా, మరో పక్కన మోడల్ గా చేస్తున్నాడు. "గాయకుడు" అనే మూవీతో బిగ్ స్క్రీన్ పై అలీ కనిపించాడు కానీ ఈ మూవీ ఆశించినంత స్థాయిలో ఆడలేదు. కానీ బిగ్ బాస్ షో ద్వారా అభిమానుల్ని బాగా సంపాదించుకున్నాడు. ఇక కూతురితో దిగిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హ్యాపీ ఫాథర్స్ డే అంటూ అలీ కి విషెస్ చెప్తున్నారు నెటిజన్స్..