English | Telugu

జబర్దస్త్ జడ్జి సీట్ ఎప్పటికైనా రోజాదే!


'జబర్దస్త్' ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కిట్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఇటు వినోదం పంచుతూనే కమెడియన్స్ గా కూడా ఈ స్కిట్స్ లో పెర్ఫామ్ చేసే వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటున్నారు. వారంలో ఒక్కరోజైనా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి మల్లెమాల చేసిన ప్రయోగం మంచి సక్సెస్ ని ఇచ్చింది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సుధీర్, రష్మీ, ఆటో రాంప్రసాద్, సన్నీ, ముక్కు అవినాష్, రాఘవ, చంటి, గెటప్ శీను.. ఇలా ఒక్కరిని కాదు ఎంతో మందికి మంచి లైఫ్ ని అందించింది ఈ జబర్దస్త్ షో.

ఇక జడ్జెస్ విషయానికి వస్తే నాగబాబు, రోజా, అనసూయ, ఇంద్రజ.. ఇలా వీళ్ళందరూ కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు. ఇటీవల కొన్ని నెలల నుంచి ఈ జబర్దస్త్ లో వస్తున్న మార్పుల్ని గమనిస్తూనే ఉన్నాం. ఐనా అన్ని ఆటుపోట్లను తట్టుకుంటూ ప్రతీ వారం కూడా టంచనుగా మన ముందుకు వచ్చి నవ్విస్తూనే ఉంది. ఫైర్ బ్రాండ్ రోజా ఒక వైపు జడ్జిగా, మరో వైపు రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తూ బాలన్స్ చేసుకుంటూ వచ్చారు.

ఐతే ఆమెకు మంత్రి పదవి వచ్చేసరికి ఈ షో జడ్జి స్థానం నుంచి తప్పుకున్నారు. ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ ఇంద్రజ వచ్చారు. ఐతే ఈ షోలో ఇంద్రజకి సంబంధించి కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అది ఏంటంటే రోజాకు మంత్రి పదవి రాకూడదని ఇంద్రజ ఆ దేవుడిని కోరుకున్నారనే విషయం జబర్దస్త్ స్టేజి మీద బయటపెట్టాడు ఆటో రాంప్రసాద్. ఇంద్రజ కూడా తానూ అలాగే కోరుకున్నానని మనసులో మాట చెప్పేసారు. 'ఒకవేళ రోజా మళ్ళీ జడ్జిగా వస్తే ఈ సీట్ నుంచి నేను లేచి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఈ జబర్దస్త్ స్టేజిపై తొమ్మిదేళ్ల పాటు రోజా ఒక ట్రెండ్ సృష్టించారు. ఇప్పుడంటే మంత్రి పదవి వచ్చిందని అటు వెళ్లారు. ఎప్పటికైనా ఈ జబర్దస్త్ జడ్జి సీటు ఆమెదే. ఏ వేదిక మీదైనా ఇదే విషయాన్ని చెప్తాను' అంటూ ఇంద్రజ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.