English | Telugu

రాజ‌నందినిని నేనే అంటూ షాకిచ్చిన‌ అను!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సీరియ‌ల్ ప్ర‌స్తుతం ఎండింగ్ కి చేరుకుంది. శ్రీ‌రామ్ వెంక‌ట్ న‌టించి ఈ సీరియ‌ల్ ని నిర్మించారు. వ‌ర్ష‌. హెచ్ కె కీల‌క పాత్ర‌లో శ్రీ‌రామ్ వెంక‌ట్ కు జోడీగా న‌టించింది. ఇత‌ర పాత్ర‌ల్లో జ‌య‌ల‌లిత‌, బెంగ‌ళూరు ప‌ద్మ‌, విశ్వ‌మోహ‌న్‌, రామ్ జ‌గ‌న్‌, రాధాకృష్ణ‌, అనూషా సంతోష్‌, క‌ర‌ణ్‌, మ‌ధుశ్రీ‌, ఉమాదేవి త‌దిత‌రులు న‌టించారు.

అల్లరిపాలెం అనసూయ v / s చెప్పంపాలెం సుధీర్

సూపర్ సింగర్ జూనియర్ షో చిన్న పిల్లల పాటలతో ప్రతీ వారం అద్దిరిపోతూ మంచి రేటింగ్స్ ని సొంతం చేసుకుంటోంది. ఇక ఈ వారం ఎపిసోడ్ ఫోక్ థీమ్ సాంగ్స్ తో ఇరగదీసేందుకు పిల్లలు సిద్ధమైపోయారు. ఇక ఈ ప్రోమో ఇటీవలే రిలీజ్ అయ్యింది. ఇందులో అల్లరిపాలెం నుంచి అనసూయ లంగా వోణిలో పొడవాటి జడతో అందంగా తయారై రాగా  మరో హోస్ట్ చెప్పంపాలెం నుంచి సుధీర్ ట్రెడిషనల్ డ్రెస్ తో వచ్చి కాసేపు ఒకరినొకరు ఆటపట్టించుకుని స్టేజిని నవ్వులతో ముంచేశారు. ఇక ఈ షోకి స్పెషల్ జడ్జిగా మాల్గాడి శుభ గారిని ఇన్వైట్ చేస్తారు. ఇక మాల్గాడి శుభ గారి పాట పాడే విధానం గురుంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వస్తూనే పకడో,పకడో అంటూ హుషారెత్తించే పాట పాడేసి స్టేజి మీద అందరిని లేచి డాన్స్ చేసేలా  చేసి ప్రోగ్రాంని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. 

హాసినికి న‌య‌ని చెప్పిన ర‌హ‌స్యం ఏంటీ?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `త్రిన‌య‌ని`. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ సీరియ‌ల్ గ‌త కొన్ని వారాలుగా జీ తెలుగులో విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతోంది. జ‌ర‌గ‌బోయేది ముందే తెలిసే వ‌ర‌మున్న ఓ యువ‌తి క‌థ‌గా ఆద్యంతం ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో.. ట్విస్ట్ ల‌తో ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా సాగుతోంది. అషికా గోపాల్‌, చందూ గౌడ కీల‌క జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో ప‌విత్ర జ‌య‌రామ్‌, నిహారిక హర్షు, విష్ణు ప్రియ, శ్రీ‌స‌త్య‌, భావ‌నా రెడ్డి, సురేష్ చంద్ర‌, అనిల్ చౌద‌రి, ద్వార‌కేష్ నాయుడు న‌టించారు.