English | Telugu
జున్నుకి అక్షరాభ్యాసం చేయించిన లాస్య
Updated : Jun 20, 2022
"మా మ్యూజిక్ "లో గతంలో ప్రసారమైన సంథింగ్ స్పెషల్ ప్రోగ్రాంతో సూపర్ డూపర్ హిట్. ఈ షో కి యాంకర్స్ గా రవి, లాస్య అదనపు ఆకర్షణ అని చెప్పొచ్చు. లాస్య ఎప్పుడూ చీమ,దోమ, ఏనుగు జోక్స్ లో మంచి పాపులర్ కూడా అయ్యింది. ఈ షోని లాస్య ఎప్పుడూ నవ్వుతూ చక్కగా చలాకీగా డాన్స్ చేస్తూ రక్తి కట్టించేది. అప్పట్లో ఈ షోకి యూత్ ఫాన్స్ చాలా మంది ఉండేవారు. వీళ్ళిద్దరిలో ఎవరు రాకపోయినా కూడా ఆరోజు ఆడియన్స్ ఎందుకు రాలేదు అనే ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేసేవాళ్ళు. తర్వాత కొంత కాలానికి రవి, లాస్య మీద సోషల్ మీడియాలో చాలా చెత్త ట్రోల్ అయ్యేసరికి లాస్య యాంకరింగ్ మానేసింది. తర్వాత కొంతకాలానికి ఎవరి లైఫ్ లో వాళ్ళు సెటిల్ ఇపోయారు. ఇక ఇప్పుడు లాస్య మంజునాథ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.
ఆయన కూడా లాస్య వచ్చే ప్రతీ షోకి రావడం వలన ఆడియన్స్ కి చిరపరిచితమే. వీళ్లకు జున్ను అనే మూడేళ్ళ బాబు ఉన్నాడు. ఇటీవల తనకు అక్షరాభ్యాసం చేయించారు లాస్య మంజునాథ్. బాసరలో అక్షరాభ్యాసం చేయిస్తే మంచిదని అక్కడే చేయించాం అంటూ చెప్పుకొచ్చింది లాస్య. గోదావరిలో జున్నుకి స్నానం చేయించి, దీపారాధన చేసింది లాస్య. అక్షరాభ్యాసం చేయించే టైంలో బాగా ఏడుస్తూనే ఉన్నాడట జున్ను. కానీ చివరికి ఎలాగో ఒకలా ఓం అక్షరాలను ఏడుస్తూనే అక్షరాభ్యాసం చేసాడని చెప్పింది లాస్య. ఇప్పుడు ఈ వీడియోకి చాలామంది కామెంట్స్ ఇస్తున్నారు. జున్నుకి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, జున్నుకి మంచి పేరెంట్స్ దొరికారని ఇలా...ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.