English | Telugu
`పటాస్` కోసం ఫైమా అంత పని చేయాలనుకుందా?
Updated : Jun 20, 2022
బుల్లితెర ప్రేక్షకుల్ని కడుపుబ్బా నివ్వస్తున్ంన కామెడీ షోస్ జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్. ఈ షోల్లో టీమ్ లీడర్ చేసే స్కిట్ లు పండించే హాస్యం అంతా ఇంతా కాదు. అయితే ఇందులో సహజంగా తనదైన పంధాలో ఆకట్టుకుంటూ నవ్వులు పూయిస్తోంది ఫైమా. తెలంగాణ యాసలో ఫైమా వేసే పంచ్ లు.. చేసే హంగామా హాస్య ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. బుల్లెట్ భాస్కర్ టీమ్ లో గత కొంత కాలంగా టీమ్ మెంబర్ గా కంటిన్యూ అవుతూ వస్తోంది. `పటాస్` షోతో బుల్లితెరకు పరిచయమైన ఫైమా ఈ షో కు వెళ్లడానికి అంగీకరించకుంటే ఆత్మ హత్య చేసుకుంటానని ఇంట్లో వాళ్లని బెదరించిందట.
జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోల్లో రాణిస్తున్న ఫైమా తాజాగా పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. `నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో `పటాస్` షో వచ్చేది. అయితే మా ఇంట్లో టీవి కూడా వుండేది కాదు. మేం చాలా పూర్. మా సార్ నన్ను కాలేజీ ట్రిప్ అని చెప్పి ... పటాస్ షో కు తీసుకెళ్లారు. అలా నేను టీవి ఇండస్ట్రీలోకి వచ్చా. నేను మాట్లాడిన విధానం.. తెలంగాణ యాస డైరెక్టర్లకు నచ్చింది. ఆఫర్లు ఇచ్చారు. అయితే నేను తరువాత చెప్లా అని వచ్చేశా. మా ఇంటికి వచ్చి చెబుఇతే మా వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో నేను చచ్చిపోతా అని బ్లాక్ మెయిల్ చేస్తే ఒప్పుకున్నారు. ఒకప్పుడు మా ఊరికి ఎవరైరనా వస్తే నేను ఫొటోలు దిగేందుకు పరుగెత్తేదాన్ని. కానీ ఎప్పుడు నేను ఊరికి వెళితే.. నాతో ఫొటో దిగేందుకు చాలా మంది వస్తున్నారు. చాలా హ్యాపీగా వుంది. మా ఊర్లో మా నాన్న పేరు పోయి... నా పేరు వచ్చేసింది.
భాస్కర్ అన్ననే నాకు అన్నీ. గురువులా నేర్పిస్తాడు. తండ్రిలా ఎంతో ఓపిగ్గా చెబుతాడు. డల్ గా వుంటే ఏంట్రా బంగారు తల్లి అంటూ నవ్విస్తాడు. ఇక్కడ అందరం ఒకరిని ఒకరం ప్రోత్సహించుకుంటాం. `పటాస్` క్లోజ్ అయిన తరువాత జీవన్ అన్న టీమ్ లో చేశా. అక్కడ పెద్దగా పేరు రాలేదు. భాస్కర్ అన్న టీమ్ లో జాయిన్ అయ్యా.. ఆ తరువాతే లైఫ్ మారింది. ఇంట్లో మాట్లాడే విధంగానే స్కిట్ లో మాట్లాడాలని భాస్కర్ అన్న చెప్పాడు. అలాగే చేస్తున్నా. సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. కానీ ప్రస్తుతం జబర్దస్త్ లోనే చేస్తానని, సినిమా ఆఫర్లని అంగీకరించడం లేదు` అని తెలిపింది.