English | Telugu
రక్తంతో నిరుపమ్ బొమ్మ గీసిన జ్వాల
Updated : Jun 20, 2022
బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ `కార్తీక దీపం`. గత కొన్నేళ్లుగా స్టార్ మా లో ప్రసారం అవుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సోమవారం జూన్ 20 ఎపిసోడ్ ఎలా వుండబోతోంది? అనేది ఒక సారి చూద్దాం. ఎపిసోడ్ ప్రారంభంలో జ్వాల నీతో నేను తేల్చుకోవాలి అని నిరుపమ్ పిలిస్తే లేదు నేను వస్తాను అని హిమ అడ్డపడుతుంది. దీంతో తింగరి ఏంటిది నేను డాక్టర్ సాబ్ తో మాట్లాడాలి. ఇన్నాళ్లు చెప్పకుండా ఆపావు.. ఇప్పుడు ఏంటీ ఇలా మధ్యలోకి వస్తున్నావు.. అంటూ సీరియస్ అవుతుంది జ్వాల.
కట్ చేస్తే.. హిమ ఏం ఆలోచిస్తోందో అని సౌందర్య ఫీలవుతూ వుంటుంది. అదే సమయంలో శోభ ఎంట్రీ ఇస్తుంది. మీతో కొంచెం మాట్లాడాలి మేడమ్ అంటుంది. మీ మనవరాలు ఎక్కడ వుందో నాకు తెలుసు అని సౌందర్యకు షాకిస్తుంది. ఎవరికి కనిపించని మనవరాలు నాకు కనిపించిందని అంటుంది. ఈ విషయాన్ని హిమ చాటుగా వింటూ వుంటుంది. శోభ మాటలకు తనే శౌర్యనా అని సౌందర్య ఆలోచనలో పడుతుంది. ఈలోగా నిరుపమ్ తో నా పెళ్లి చేయండి. పెళ్లి జరిగిన మరుక్షణమే మీ మనవరాలు శౌర్య మీ ముందుంటుంది అని చెబుతుంది.
ఇదంతా గమనిస్తున్న హిమ `శౌర్య ని అడ్డు పెట్టుకుని శోభ అమ్మమ్మని బ్లాక్ మెయిల్ చేస్తోందని గ్రహిస్తుంది. తను చేస్తున్న దానికి ఆగ్రహంతో ఊగిపోతుంది. కట్ చేస్తే... నిరుపమ్ .. శౌర్యను అనాథాశ్రమానికి తీసుకొస్తాడు. నేను నీతో మాట్లాడాలి అంటే ఒక్క క్షణం అంటాడు. కానీ శౌర్య వినకుండా ప్రపోజ్ చేయడం కోసం వెళుతుంది. తన రక్తంతో నిరుపమ్ బొమ్మను వేసి తీసుకువస్తుంది. అది చూసి నిరుపమ్ షాక్ అవుతాడు. మీరు నో అంటే నా గుండె పగిలిపోతుంది అని చెబితే నిరుపమ్ సైలెంట్ అయిపోతాడు. ఆ తరువాత జరిగిన దంతా హిమకు చెబుతుంది జ్వాల. ఆ తరువాత హిమ, నిరుపమ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.