English | Telugu

తప్పిపోయిన సుమ కొడుకు


ఈటీవీలో కాష్ ప్రోగ్రాం ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఈ షోకి సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షో ద్వారా అప్పుడే రిలీజ్ ఐన కొత్త సినిమాల టీమ్స్ ని కొత్త కొత్త సెలబ్రిటీస్ ని తీసుకొచ్చి స్టేజి మీద గేమ్స్ ఆడిస్తూ ఉంటారు సుమ . రకరకాల జోక్స్, డ్యాన్సులు అన్ని ఎలిమెంట్స్ ఈ షోలో కనిపిస్తాయి. ఇక ఇప్పుడు ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి 10th క్లాస్ డైరీస్ టీమ్ వచ్చింది. ఇందులో శ్రీరామ్, భానుశ్రీ, రాము, రామారావు, సురేష్ అంత కనిపిస్తారు. వీళ్ళతో రకరకాల ఆటలు ఆడించింది సుమ. ఇందులో తన కొడుకు తప్పిపోయాడంటూ ఒక ప్రకటన ఇస్తుంది సుమ .

చాలామంది సుమ కొడుకుని అంటూ వస్తూ ఉంటారు. వాళ్ళతో మస్త్ ఎంటర్టైన్ చేసింది సుమ. ఇంతలో రాము వచ్చి నేను నీ కొడుకుని అమ్మ నన్ను గుర్తుపట్టలేదా..లోకల్ గా బస్సు పాస్ లేదంటే పాస్పోర్ట్ ఇచ్చి పంపించావ్ ..విదేశాలకు వెళ్ళొచ్చాను అంటూ చెప్పేసరికి "ఓరిని నువ్వు నా కొడుకువా. అదే నిజమైతే ఇందులో ఏదో ఒకటి తినేయాలి" అంటూ "ఎదురుగా అల్లం, వేపాకు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర" చూపిస్తుంది. వేపాకు తిని చాలారోజులయ్యింది అంటూ వాటిని తినేస్తాడు రాము. అబ్బా అచ్చం మేక తింటున్నట్టే ఉందిరా అంటూ సెటైర్ వేస్తుంది సుమ. ఇంతలో రామారావు వచ్చి అమ్మ నేను కొడుకునే అమ్మ గుర్తుపట్టట్లేదా అమ్మా ? అంటూ కృష్ణ గారి స్టైల్ లో అడిగేసరికి నేను సూపర్ స్టార్ కృష్ణ గారికి తల్లినయ్యానా ?. అంటూ సుమ అడుగుతుంది. తర్వాత శ్రీరామ్ "ఎక్కడున్నావమ్మా" అనే సాంగ్ కి మంచిగా డాన్స్ చేసి ఆడియన్స్ ని అలరించారు. చివరిగా శ్రీరామ్ త్రిషతో కలిసి షూటింగ్ చేసే టైములో సెట్ లో జరిగిన ఫైర్ ఆక్సిడెంట్ కారణంగా తన లైఫ్ ఎంత రిస్క్ లో పడిందో చెప్పేసరికి అందరికీ కాస్త బాధకలిగింది. ఇప్పుడు ఈ ప్రోమో వైరల్ అవుతోంది. శ్రీరామ్ సాంగ్ "ఎక్కడున్నావమ్మా " ఆల్ టైం ఫేవరెట్ అంటూ , చాల రోజుల తరువాత శ్రీరామ్ గారు హ్యాపీ ఉండడం చూసాం. మంచి నటుడు, సుమ గారు ఎక్కడున్నా చక్కగా ఎంటర్టైన్ చేస్తారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.