English | Telugu

ఎందుకీ ఆవేశం ..? ట్వీట్ లో మండిపడిన కౌశల్

అగ్నిపథ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్. ఎటు చూసినా ఇదే అంశం పై చర్చోపచర్చలు వినిపిస్తున్నాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గర ఆందోళనకారులు రైళ్లను తగలబెట్టారు. ఐతే ఈ అగ్నిపథ్ స్కీంకి సంబంధించి ప్రజల్లో భిన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కొందరు ఈ స్కీం ని విమర్శిస్తుంటే మరి కొందరు యూత్ కి ఈ స్కీం చాలా ఉపయోగం అంటున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఒక ట్వీట్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇలాంటి సమయంలో ఈ ఇష్యూ మీద బిగ్ బాస్ ఫేమ్, యాక్టర్ ఐన కౌశల్ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు.

ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఈ అగ్నిపథ్ స్కీం అనేది కరెక్ట్ కాదంటూ నిరుద్యోగులు అల్లర్లకు దిగుతున్నారు. ఎన్నో ఏళ్ళు కష్టపడి ఆర్మీలో చేరితే నాలుగేళ్ల గడువుతో నియామకాలు చేపట్టడం అన్యాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇంత ఉన్మాదం పనికిరాదంటూ కౌశల్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. నిరసనల పేరు చెప్పి ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం మూర్ఖత్వం అని అన్నాడు. సికింద్రాబాద్ లో తగలపెట్టిన ఒక్కో రైలు ఖరీదు 200 కోట్లు. జరిగిన నష్టం సుమారుగా 600 కోట్లు దీనివల్ల రాజకీయ నాయకులు ఏమీ నష్టపోరు.. ప్రజల నెత్తినే పన్నుల రూపంలో భారం వేస్తారు అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.