బోనాలు స్పెషల్: పండగలా 'జీ తెలుగు వారి జాతర'
బోనాల పండగ అనగానే భక్తుల కోలాహలంతో నిండిన గుళ్ళు, పోతరాజుల సందడి, అదరగొట్టే పాటలు, మరియు జాతరలు గుర్తుకురావడం సహజం. ఐతే, ఈ ఆదివారం ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ 'జీ తెలుగు' బోనాల పండగ సంధర్బంగా అదే సందడిని మీ టీవీ స్క్రీన్స్ పై ఆవిష్కరించనుంది. 'జీ తెలుగు వారి జాతర' అనే కార్యక్రమంతో బుల్లితెర తారలు, కమెడియన్స్, మరియు సింగర్స్ చేసిన హడావుడిని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ నాన్-స్టాప్ వినోదాన్ని పంచనుంది. శ్రీముఖి యాంకర్ గా మరియు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, సుమంత్ అతిధులుగా అలరించనున్న ఈ కార్యక్రమం, జూలై 31న సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది.