English | Telugu

సుమ కనకాల...రాజీవ్ వెనకాల అన్న అవినాష్

ఇస్మార్ట్ బోనాలు పేరుతో స్టార్ మాలో ప్రత్యేక కార్యక్రమం ప్రసారం కాబోతోంది. ఇందులో సుమ హోస్ట్ గా చేసింది. ఇక ఇప్పుడు ఈ ప్రోమో  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అవినాష్, రవికృష్ణ, బాబా భాస్కర్, బుల్లి తెర జంటలు ఎంతో మంది ఈ షోలో కనిపించబోతున్నారు. డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి కూడా ఈ స్టేజి మీద అందంగా మెరిసింది. అవినాష్ కి రెడ్ ఫ్లవర్ ఇస్తుంది నేహా. అవినాష్ బ్యాక్ డ్రాప్ లో ఫీల్ మై లవ్ సాంగ్ వేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అవినాష్ ఊహలకు బ్రేక్ వేస్తూ "బ్రో" అంటుంది నేహా. అంతే ఒక్కసారి షాక్ ఐపోతారంతా.. ఈ ఎపిసోడ్ లో అవినాష్ పేరు ఎగ్గొట్టం నిఖిల్ పేరు పొగ్గొట్టం అని పరిచయం చేసుకుంటారు.