English | Telugu
ఎవరికైనా ఎప్పుడైనా సాయం చేశావా?.. ఓంకార్‌పై జ్యోతి మండిపాటు!
Updated : Jul 27, 2022
ఆట సందీప్ అంటే బుల్లి తెర మీద పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. సందీప్, అతని భార్య జ్యోతి రాజ్ ఇద్దరూ కలిసి డాన్స్ వీడియోస్ చేస్తూ సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటారు. డాన్స్ స్టెప్స్ కూడా నేర్పిస్తూ లైం లైట్ లో ఉన్నారు. ఐతే ఇప్పుడు ఓంకార్ ని టార్గెట్ చేస్తూజ్యోతి కొన్ని ప్రశ్నలను సూటిగా సంధించింది. "ఎవరైనా తాను ఎదుగుతూ తన చుట్టుపక్కల వారిని ఎదిగేలా చేయడం మానవత్వం అంటారని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మరి నటుడు, యాంకర్ ఐన ఓంకార్ ఏమన్నా ఇలాంటివి చేశాడా?" అంటూ ఆమె ఓంకార్ మీద మండిపడ్డారు.
'ఆట' షోతో గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్ తర్వాత ఎన్నో షోస్ నిర్వహించారు. ఈరోజు రియాలిటీ షోస్ కి డిమాండ్ ఇంతలా పెరిగింది అంటే దానికి కారణం ఓంకార్ అని చెప్పొచ్చు. మొదట జెమినీ మ్యూజిక్ లో వీజేగా కెరీర్ని స్టార్ట్ చేసాడు. తర్వాత ఆట, మాయాద్వీపం, ఛాలెంజ్, ఇష్మార్ట్ జోడి, సిక్స్త్ సెన్స్ వంటి సూపర్ డూపర్ షోస్ తో ఒక రేంజ్ లో ఎదిగి పేరు తెచ్చుకున్నాడు ఓంకార్.ఇప్పుడు ఆహా ఓటిటిలో 'డాన్స్ ఐకాన్' అనే షోకి హోస్ట్ గా కూడా చేస్తున్నాడు. ఇటు సిల్వర్ స్క్రీన్ మీద తానేంటో ప్రూవ్ చేసుకుంటూ బిగ్ స్క్రీన్ వైపు కూడా అడుగులు వేసి జీనియస్, రాజుగారి గది 1, 2 డైరెక్ట్ చేశాడు. నాగార్జునని పెట్టి 'రాజుగారి గది 2' తీసాడంటే ఓంకార్ రేంజ్ ఏంటో ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది.
"చాలా రియాలిటీ షోస్ లో గుర్తింపు తెచుకున్నవారికి చాలామంది మంచి అవకాశాలు ఇస్తున్నారు. కానీ ఓంకార్ మాత్రం అలా ఎందుకు ఛాన్సులు ఇవ్వడం లేదు, మంచి డాన్సర్స్ గా గుర్తింపు తెచ్చుకున్నవారిని ఎందుకు పట్టించుకోవడం లేదు?" అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది జ్యోతి. అలాగే "ఓంకార్ మూవీస్ తీసేటప్పుడు పెద్ద పెద్ద డాన్స్ మాస్టర్స్ నే ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇలాంటి వాళ్ళను, అలాగే మీ తమ్ముళ్లను ఎందుకు ఎంకరేజ్ చేయడం లేదు? వాళ్లకు ఎదిగే అవకాశాన్ని ఎందుకు కల్పించడం లేదు" అని అడిగింది.
"ఒకప్పుడు ఆటలో చేసిన ఒక్క కొరియోగ్రాఫర్ కైనా ఇప్పుడు లైఫ్ ఉందా? లేదు కదా.. వాళ్ళు అవకాశాలు లేక, ఈవెంట్స్ కి ఎవరూ పిలవక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆట షోలో ఒకప్పుడు టాప్ అని పేరు తెచుకున్నవాళ్లంతా ఇప్పుడు కింద పడిపోయారు. వీళ్లల్లో ఎవరినైనా చూసినప్పుడు చాలా బాధగా ఉంటుంది" అంటూ తన మనసులో ఆవేదనని బయటపెట్టింది జ్యోతి. ఈ కామెంట్స్ కి ఓంకార్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.