English | Telugu

‘ఇద్దరు పిచ్చోళ్ళు కలిసి డాన్స్ చేస్తే ...ఇలా ఉంటదన్నమాట’ అంటున్న నెటిజన్స్

స్మాల్ స్క్రీన్ పై అవినాష్, శ్రీముఖి ఎప్పుడు కొత్త కొత్త జోక్స్ తో షోస్ లో సందడి చేస్తూనే ఉంటారు. అవినాష్, శ్రీముఖి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా. అవినాష్ పెళ్ళిలో శ్రీముఖి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ లో ఇద్దరూ మంచి డాన్సులతో హంగామా చేస్తూ ఉంటారు. శ్రీముఖి చేసిన హెల్ప్ వల్లనే తాను బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగలిగానని ఎప్పుడు చెప్తూ ఉంటాడు అవినాష్. వీళ్ళిద్దరూ కలిసి చేసే డాన్స్ వీడియోస్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉంటాయి. ఇప్పుడు తాజాగా పల్సర్ బైక్ మీద రా మోవ అనే సాంగ్ కి వీళ్ళిద్దరూ డాన్స్ చేసి దుమ్ములేపేసారు.

‘నాకు నాన్నే లేడు’ అంటూ ఫీల్ అవుతున్న ఆది

శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. "నా కొడుకు" అనే టైటిల్ తో ఈ వారం ఎపిసోడ్ రాబోతోంది. ఇక ఈ వారం షోకి కృష్ణభగవాన్ గెస్ట్ గా వచ్చి ఎంటర్టైన్ చేశారు. ఎఫ్ 3 లో కొడుకులు తప్పిపోయిన థీమ్ తో ఈ వారం ఎపిసోడ్ అలరించనుంది. తప్పిపోయిన కొడుకుల కోసం భగవాన్ ఎదురు చూస్తూండేసరికి  కొడుకులమంటూ ఆది, రాంప్రసాద్ వస్తారు. తప్పిపోయింది కొడుకులు కానీ దొంగ నా కొడుకులు కాదు అంటాడు భగవాన్. నేను మీ కూతురిని అంటూ వర్ష వచ్చేసరికి అవును నువ్వే నా కొడుకువి అంటాడు భగవాన్. తర్వాత నవీన వచ్చేసరికి మన ఇద్దరం తర్వాత పర్సనల్ గా మాట్లాడుకుందాం అంటూ కన్ను కొడతాడు భగవాన్.