English | Telugu

యాంకర్ ఉంటారు కానీ యాంకరింగ్ ఉండదు

శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతీ వారం లాగే ఈవారం ఎపిసోడ్ బోనాల జాతర కూడా మస్త్ ఎంటర్టైన్ చేసేసింది. ఇక ఈ ఎపిసోడ్ లో మధుప్రియ తన  ఫామిలీ మొత్తాన్ని తీసుకొస్తుంది. ఇక రష్మీ వచ్చి తన టీమ్ మొత్తాన్ని స్టేజి మీద పిలిచి ఈరోజు మనమంతా మధుప్రియ ఆహ్వానం మేరకు వాళ్ళ ఊరికి వచ్చాము. వాళ్ళ ఫామిలీ మొత్తాన్ని ఎంటర్టైన్ చేయాలి మనమే అని అంటుంది. ఇంతలో ఆది వచ్చి మధుప్రియ ఇంతకు మీ ఊరి స్పెషలిటీ ఏమిటి అని అడుగుతాడు ." వానలు పడకుండా పంటలు పండుతాయి, గేదలు లేకుండా పాలొస్తాయి..  మరి మీ స్పెషలిటీ ఏమిటి అని అడుగుతుంది" మా స్పెషలిటీ కూడా అంతే యాంకర్ ఉంటారు కానీ యాంకరింగ్ ఉండదు, కమెడియన్స్ ఉంటారు కానీ కామెడీ ఉండదు" అని అంటాడు.

హలో బ్రదర్ అంటున్న శ్రీముఖి

శ్రావణ మాసం మొదలయ్యింది అంటే చాలు  ఎటు చూసినా పండగలు, పెళ్లిళ్లే సందడి చేస్తూ లేని హుషారును తెప్పిస్తాయి. ఇక ఈ శ్రావణమాసంలో వచ్చే  రాఖీ పండగ కూడా అంతే ఆనందాన్ని అందిస్తుంది. అన్నలకు చెల్లెళ్ళు, తమ్ముళ్లకు అక్కలు రాఖీలు కట్టుకుని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ పండగ ఒక స్పెషల్ అని కూడా చెప్పొచ్చు. ఇక ఇప్పుడు బుల్లితెర మీద ఎటు చూసిన సీజనల్ ఈవెంట్స్ బాగా ఎంటర్టైన్ చేసేస్తున్నాయి.  ఇదే నేపథ్యంలో  ఇప్పుడు మల్లెమాల వాళ్ళు కూడా అటు జీ తెలుగు షోస్, ఇటు స్టార్ మా షోస్ తో సమానంగా ముందుకెళ్లేందుకు భారీగానే సన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రక్షా బంధన్ ని పురస్కరించుకుని "హలో బ్రదర్ "అనే షోని ప్లాన్ చేసింది.