English | Telugu
మాట్లాడలేని స్థితిలో శ్రీవాణి!
Updated : Jul 27, 2022
శ్రీవాణి ఎప్పుడూ గలగలా నవ్వుతూ ఉంటుంది. బుల్లితెర మీద రకరకాల షోస్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. భర్త, కూతురితో కలిసి యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఎప్పటికప్పుడు నెటిజన్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. ఈమె చంద్రముఖి సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. మనసు మమత, కలవారి కోడలు, కాంచన గంగ, మావి చిగురు, ఘర్షణ వంటి సీరియల్స్ లో నటించింది శ్రీవాణి. ఎప్పుడూ సరదాగా నవ్వుతూ ఉండే శ్రీవాణి ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితికి చేరుకుంది.
శ్రీవాణికి మాట పోయిందన్న విషయాన్ని ఆమె భర్త విక్రమ్ స్వయంగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పుకొచ్చారు. మొదట జలుబు అనుకున్నారట. దాని కోసం కొన్ని మందులు కూడా వాడాం అని చెప్పుకొచ్చారు. "రోజురోజుకు గొంతు సమస్య పెరిగిపోతూ చివరికి మాట్లాడలేకపోయే పరిస్థితికి వచ్చేసరికి చాలా భయంవేసింది. శ్రీవాణిని చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తోంది" అని చెప్పాడు విక్రమ్.
డాక్టర్ కి చూపిస్తే గట్టిగా అరవడం కారణంగా గొంతు లోపలి టిష్యూ వాచిందని చెప్పారు. దానికోసం కొన్ని మందులు కూడా ఇచ్చారట. ఐతే మందులు వేసుకోవాలి కానీ నెల రోజుల పాటు అసలు మాట్లాడకూడదు.. అప్పుడే సెట్ అవుతుందని చెప్పారట. నెల తర్వాత మళ్ళీ గొంతు మాములుగా ఐపోతుందని డాక్టర్ చెప్పారన్నారు. ఐతే శ్రీవాణి మాట కోల్పోవడం పై ఆమె అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.