English | Telugu

మోనిత‌లా తాళి క‌ట్టుకుంటాన‌న్న శోభ‌!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక‌దీపం`. స్టార్ మా లో గ‌త కొంత కాలంగా ప్ర‌సారం అవుతోంది. గ‌తంలో మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుని రికార్డు స్థాయి రేటింగ్ ని సొంతం చేసుకున్న ఈ సీరియ‌ల్ ఇప్ప‌డు కాస్త వెన‌క‌బ‌డింది. మ‌ళ్లీ టాప్ రేటింగ్ తో నెం.1 స్థానాన్ని సొంతం చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది కానీ అది సాధ్య‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేదు. ఇదిలా వుంటే బుధ‌వారం ఎపిసోడ్ ఎలా వుండ‌బోతోందో ఓ సారి లుక్కేద్దాం. హిమ కోసం నిరుప‌మ్ ఇంట్లోంచి వెళ్లిపోతాడు. సౌంద‌ర్య ఇంట్లో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాడు.

ఇలా జ‌ర‌గ‌డంతో స్వ‌ప్న త‌న భ‌ర్త స‌త్య‌ని నిందిస్తూ వుంటుంది. మీరు ఏం చేస్తారో నాకు తెలియ‌దు.. నా కొడుకు నా ఇంట్లో వుండాలి అంటూ భ‌ర్త‌కు వార్నింగ్ ఇస్తుంది స్వ‌ప్న‌. క‌ట్ చేస్తే సౌంద‌ర్య‌, ఆనంద‌రావులు .. నిరుప‌మ్ ఇంటికి వ‌చ్చిన విష‌యం గురించి మాట్లాడుకుంటుంటారు. క‌ట్ చేస్తే..హిమ‌.. నిరుప‌మ్ గురించి ఆలోచిస్తూ వుంటుంది.. ఇంత‌లో నిరుపమ్.. హిమ కోసం స్పెష‌ల్ గిఫ్ట్ తీసుకుని వ‌స్తాడు. జీన్స్‌, టీష‌ర్ట్ తెచ్చాన‌ని అవి నువ్వు వేసుకుని తీరాల్సిందేని చెబుతాడు నిరుప‌మ్‌. అది విన్న శౌర్య ఇంట్లో ఏదేదో జ‌రుగుతోంది. అంతా నాట‌కాలు ఆడుతున్నారంటుంది.

క‌ట్ చేస్తే... నిరుప‌మ్ విష‌యంలో ఏదో ఒక నిర్ణ‌యం తీసుకోవాల‌ శోభ ఆలోచిస్తూ వుంటుంది. అదే స‌మ‌యంలో అక్క‌డికి స్వ‌ప్న వ‌స్తుంది. అప్పుడు త‌న‌తో `నేను కూడా మోనిత‌లా మెడ‌లో తాళిబొట్టు క‌ట్టుకుంటాను` అని శోభ చెబుతుంది. వెంట‌నే షాక్ అయిన స్వ‌ప్న నేనేంటో చూనిస్తాను రెండు రోజులు టైమ్ ఇవ్వు అంటుంది. మ‌రో ప‌క్క‌.. ఇంట్లో హిమ మాత్రం నిరుప‌మ్ ఇంటికి ఎందుకొచ్చాడ‌ని ఆలోచ‌న‌లోప‌డుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.