నూకరాజు, ఆసియా పెళ్లి జరిపించేసిన సుమ!
క్యాష్ షో ఎప్పుడూ సూపర్ గా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నటీనటులు వస్తూ ఉంటారు. ఐతే ఇప్పుడు క్యాష్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇప్పటి వరకు అలా హాయిగా నవ్వులతో సాగిపోయే ఈ షో ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి పెళ్లిళ్లు చేసే స్టేజిలా మారిపోయింది. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి బుల్లితెర షోస్ లో నటించే కమెడియన్ పెయిర్స్ ని తీసుకొచ్చింది సుమ. కార్తిక్-షబీనా, నూకరాజు-ఆసియా, ప్రవీణ్-ఫైమా, పరదేశి-భాను.. ఇలా నాలుగు జంటలను తీసుకొచ్చింది.