English | Telugu
వేదని మళ్లీ అవమానించిన మాళవిక!
Updated : Jul 27, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. గత కొన్ని వారాలుగా స్టార్ మా లో ప్రసారం అవుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తోంది. కన్నతల్లి కన్నా మిన్నగా ప్రేమించిచే యువతి, ఓ పాప చుట్టూ సాగే అందమైన కథగా ఈ సీరియల్ ని రూపొందించారు. హిందీ సీరియల్ ఆధారంగా దీన్ని తెలుగులో రీమేక్ చేశారు. నిరంజన్, డెబ్జాని మోడక్ జంటగా నటించారు. ఇతర పాత్రల్లో బేబీ మిన్ను నైనిక, బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, ప్రణయ్ హనుమండ్ల, ఆనంద్, సులోచన, వరదరాజులు.. తదితరులు నటించారు.
ఇంటి నుంచి వెళ్లిపోయిన ఖుషీ ఆచూకీని పెట్ డాగ్ చిట్టీ కారణంగా తెలుసుకున్న యష్, వేద తనని ఇంటికి తీసుకెళతారు. ఆ తరువాత వేద కోసం ఖుషీ వెల్కమ్ పార్టీని ఏర్పాటు చేస్తుంది. ఇళ్లంతా పూలతో పరిచి వేదకు వెల్కమ్ చెప్పడంతో అంతా థ్రిల్ అవుతారు. వేద మాత్రం ఎమోషనల్ అవుతుంది. కట్ చేస్తే .. వేదని ఇంటి నుంచి తీసుకెళ్లింది తల్లి సులోచన అని, తనే వేదని చేయిపట్టి ఇంటికి తీసుకొచ్చి అప్పగించాలని మాలిని కండీషన్ పెడుతుంది. సులోచన కూడా తన కూతురు కోసం ఎంత వరకైనా తగ్గడానికి తాను సిద్ధమని వెళ్లి మాలిని ముందు తల వంచుతుంది. అయితే తన వేద క్షేమం కోసం తల వంచానని, అదే తనకు ఏదైనా కష్టం వస్తే దించిన తల ఎత్తి మరీ ప్రశ్నిస్తానని చెబుతుంది.
కట్ చేస్తే.. వేద కోసం సులోచన బోనం ఎత్తుతానని మొక్కుకుంటుంది. అదే సమయంలో ఖుషీ కోసం మాళిని బోనం ఎత్తుతానని మొక్కుకుంటుంది. ఇదే విషయమై మాలిని, సులోచన మధ్య గొడవ జరుగుతుంది. ఆ తరువాత అంతా కలిసి బోనం ఎత్తుకుని గుడికి వెళతారు. అక్కడ మాళవిక ఎంట్రీ ఇస్తుంది. వేదని అవమానిస్తుంది. ఖుషీ కన్నతల్లిని నేను. కానీ ఇది కనకుండానే నా బిడ్డకు తల్లిగా మారిందని గొడవ చేస్తుంది. దీంతో ఆ మాటలు విన్న సోదమ్మ మీ ఇద్దరిలో ఆ పాపకు తల్లి ఎవరో అమ్మ నిర్ణయిస్తుందని, సజావుగా అమ్మకు ఎవరు బోనం సమర్పిస్తారో ఆమె ఈ పాపు అసలైన తల్లి అంటుంది. ఆ తరువాత ఏం జరిగింది అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.