English | Telugu

ఈ షోలో రియల్ కపుల్స్ ముద్దులే ముద్దులు!

బుల్లితెర మీద డైలీ ఎన్నో కొత్త కొత్త షోస్ వస్తూనే ఉన్నాయ్. ఇప్పుడు జీ తెలుగు వారి బోనాల జాతర షో ప్రసారం కావడానికి సిద్ధంగా ఉంది. ఈ షో టీజర్ ఇప్పుడు రిలీజ్ అయ్యింది. ఇందులో రియల్ కపుల్స్ ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళ మధ్య జరిగే టీజింగ్ పెర్ఫార్మన్సెస్ ని ఆడియన్స్ కి సరికొత్తగా చూపించబోతున్నారు. ఈ టీజర్ లో చాలా మంది కపుల్స్ వచ్చి అద్దిరిపోయే డాన్సులు చేసి హంగామా చేసేసారు. కానీ ఒకే ఒక్క డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో ఒక కపుల్ మాత్రం సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. ఆ పెయిర్ ఎవరు అంటే ఫేమస్ సింగర్ అనంత శ్రీరామ్, ఆయ‌న‌ వైఫ్ స్వాతి.

ఫస్ట్ టైం ఈ షోలో శ్రీరామ్, స్వాతి స్టేజిపై కనిపించబోతున్నారు. అనంత శ్రీరామ్ ఈమధ్య షోస్ లో జోష్ గా పాల్గొంటూ ప్రాస పదాలతో కొత్త కొత్త వాక్యాలు చెప్తూ డాన్స్ చేస్తూ తనలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తన భార్యను స్టేజి మీదకు తీసుకొచ్చి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. ఐతే శ్రీముఖి "మీ పేరు?" అని శ్రీరామ్ వైఫ్ ని అడిగింది. "జీ తెలుగు బాగుండాలి" అని ఆన్సర్ ఇచ్చింది స్వాతి.

దాంతో శ్రీముఖి పేరు చెప్పకుండా ఇదేమిటా అన్నట్టుగా క్వ‌శ్చ‌న్ మార్క్‌ ఫేస్ పెట్టేసరికి, శ్రీరామ్ ఎంట్రీ ఇచ్చి "ఆ ఒక్క డైలాగే" రాసా అంటాడు. అంతే స్టేజి మీద నవ్వులే నవ్వులు. తర్వాత "ఫ్రంట్ సీట్ లో కంఫర్ట్ గా లేదని బ్యాక్ సీట్ కి వచ్చి ముద్దు పెట్టాడు" అంటూ ఏక్‌నాథ్‌ గురించి హారిక ముద్దు సీక్రెట్ ని రివీల్ చేసి సిగ్గు పడింది. ఇలా ఈ షోలో ముద్దులెక్కువగానే కనిపించబోతున్నాయి. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు 'జీ తెలుగు వారి జాతర.. అందరూ ఆహ్వానితులే' అనే ప్రోగ్రాంలో చూడొచ్చు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.