English | Telugu
తిలోత్తమకు అసలు రహస్యం చెప్పిన విశాల్!
Updated : Jul 26, 2022
అషికా గోపాల్, చందూ గౌడ జంటగా నటించిన సీరియల్ `త్రినయని`. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సీరియల్ ఆద్యంతం ఆసక్తికర మలుపులు, ట్విస్ట్ లతో సాగుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. జీ తెలుగులో గత కొంత కాలంగా ప్రసారం అవుతున్న ఈ సీరియల్ రాత్రా 8:30 గంటలకు ప్రసారం అవుతోంది. ఇందులోని ఇతర పాత్రల్లో పవిత్రా జయరామ్, నిహారిక హర్షు, భావనా రెడ్డి, విష్ణు ప్రియ, ద్వారకేష్ నాయుడు, సురేష్ చంద్ర, అనిల్ చౌదరి, శ్రీసత్య తదితరలు నటిస్తున్నారు. మంగళవారం ఎపిసోడ్ ఎలాంటి మలుపులు తిరగనుందన్నది ఒకసారి చూద్దాం.
ఆరు బయట కూర్చుని తిలోత్తమ మొక్కజొక్క పొత్తు కాలుస్తూ వుంటుంది. ఇదేం చిత్రమో అని నయని షాకవుతూ తిలోత్తమని అడుగుతుంది. నా కొడుకు కోసం కాలుస్తున్నానని చెప్పగానే వల్లభ బావగారి కోసమా అంటుంది నయని. అయితే ఇది వల్లభ కోసం కాదని విశాల్ కోసమని తిలోత్తమ చెప్పడంతో నయని షాక్ అవుతుంది. ఏంటీ షాక్ అయ్యావా? దీనికి ఉప్పుకారం, నిమ్మకాయ రసం కాకుండా మరేదైనా రాసిస్తానని భయపడుతున్నావా? అలా చేస్తే నీకు ముందే తెలిసిపోతుంది కదా ? అందుకే ఆ పని చేయడం లేదని నయనితో అంటుంది.
కట్ చేస్తే.. నయనికి తెలిసిన ఎస్ ఐ భూషణ్ భార్యతో మాట్లాతుంటాడు. మీ ఆయన మళ్లీ గొడవలకు వెళుతున్నాడా? అంటూ నిలదీస్తుంటాడు. ఇది దూరంగా వుండి గమనించిన విశాల్ పక్కనే కార్ పార్క్ చేసి ఎస్ ఐ దగ్గరికి వెళతాడు. ఇద్దరి మాటలు గమనించి భూషణ్ చనిపోయాడు కదా! అంటాడు. ఆ మాటలు విన్న భూషణ్ భార్య విశాల్ పై అరుస్తుంది. నా భర్త నిక్షేపంగా వుంటె చనిపోయాడంటావా అంటూ ఫైర్ అవుతుంది. దీంతో ఎస్ ఐ ఎక్కడ విశాల్ కి నిజం తెలిసిపోతుందోనని కంగారు పడుతుంటాడు. ఇంతలో విశాల్ కు భూషణ్ బ్రతికే వున్నాడని నిజం తెలుస్తుంది. ఆ విషయాన్ని తన పెంపుడు తల్లి తిలోత్తమ కు చెప్పాలని విశాల్ ఇంటికి వెళతాడు. ఇదే విషయాన్ని నయనికి చెప్పాలని ఎస్ ఐ ప్రయత్నిస్తాడు కానీ నయని ఫోన్ కి అందుబాటులో వండదు. ఆ తరువాత ఏం జరిగింది? .. భూషణ్ బ్రతికే వున్నాడని తెలిసినా తిలోత్తమని భయపెడుతున్న ముగ్గురు పిల్లలు ఎవరు? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.